Thursday 1 December 2011

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ ని అయినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే !!!


ఈ తెలుగు చిత్ర సీమలో ఎందరో కథానాయకులు ఉండగా నేను విక్టరీ వెంకటేష్ అభిమానిని అయ్యాను. మిగతా హీరోలు ఎంత చక్కగా ఎడ్వ టైస్ మెంట్స్  ఇస్తున్నారో చూడండి .

నాగార్జున అక్కినేని  కల్యాణి జ్యూవలర్స్ని ప్రోస్తాహిస్తూ  తన అభిమానులను మరియు తెలుగు ప్రేక్షకులను ఉత్సాహ పరుస్తున్నాడు.

మహేష్ బాబు జోయల్క్కాస్ కొనమని గోల పెడుతున్నాడు.

జూనియర్ ఎం టి ఆర్ కూడా మలబార్ గోల్డె మంచిది అంటున్నాడు.

చివరికి అప్పులలో ఉన్నాను అంటున్న జగపతి బాబు కూడా సి ఎం ఆర్ బంగారమే కొనండి అంటున్నాడు. ( ఈయన దరిద్రం ఏమిటంటే ఆ యాడ్ కి సంబంచిన ఒక్క ఫోటో కూడా దొరకలేదు)


వాళ్ళందరూ కొను కొను అని ప్రోస్తాహిస్తుంటే మరి మనవాడు తాకట్టు పెట్టమని/అప్పులు చేయమని ఢంకా భజాయించి చెప్పుతున్నాడు.



కొసమెరుపు: ఈ అప్పులు తీర్చుకోవాలంటే నాకు కొంత అప్పు కావాలి . ఎవరైనా అప్పు ఇస్తారా? but one thing it is not only my principle not to pay interest, but also my interest not to pay principal.

4 comments:

  1. ఫన్ టాస్టిక్.

    ReplyDelete
  2. సుభ గారు కృతఙ్ఞతలు .
    తెలుగు అభిమాని గారు మీ అభిమానమునకు నమస్సులు

    ReplyDelete
  3. మన యింటనె ఉండగ బంగాఆఆఆరం! :)

    ReplyDelete