ఒక యువకుడికి చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగము వచ్చింది. వాళ్ళ ఆఫీస్ ముందు ఒక బిచ్చగాడు అడుక్కుంటున్నాడు. ఇతను రోజు ఒక రూపాయి బిచ్చం వేసేవాడు. రెండు సంవత్సరాలు అయిన తర్వాత అర్ధ రూపాయి వెయ్యడం ప్రారంభించాడు . మళ్ళీ రెండు సంవత్సరాలు అయిన తర్వాత పావలా ఇవ్వడం మొదలు పెట్టాడు.
ఆ ముష్ఠి వాడు అయ్యా మీరు ఒకప్పుడు నాకు రూపాయి ఇచ్చేవారు, తర్వాత కొద్ది కాలానికి అర్ధరూపాయి ఇవ్వడము మొదలుపెట్టారు, ఇహ ఇప్పుడు మరీ ఘోరంగా పావలాయే ఇస్తున్నారు . ఇట్లా అయితే మేము ఎట్లా బ్రతుకుతామయ్యా అని అడిగాడు.
దానికి ఆ ఉద్యోగి నాకు ఉద్యోగం వచ్చిన క్రొత్తలో నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నీకు రూపాయి ఇచ్చాను, తర్వాత నాకు పెళ్లి అయ్యింది. నా భార్య వలన కొంత కర్చు పెరిగింది, కాబట్టి అర్ధ రూపాయి ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు , మళ్ళీ కర్చు పెరిగింది కాబట్టి ఇప్పుడు పావలా ఇస్తున్నాను. అయినా నా భార్య బిడ్డలను నేను పోషించుకోవద్దా? అన్నాడు.
ఆ బిచ్చగాడు కోపంతో ఊగిపోతూ అంటే నాడబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషించుకుంటున్నావా? నీకు సిగ్గులేదు అన్నాడు.




good one :)
ReplyDelete