Showing posts with label Comedy Kaburlu. Show all posts
Showing posts with label Comedy Kaburlu. Show all posts

Friday, 2 December 2011

సిగ్గులేదు నా డబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషిస్తావా?



ఒక యువకుడికి చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగము వచ్చింది. వాళ్ళ ఆఫీస్ ముందు ఒక బిచ్చగాడు అడుక్కుంటున్నాడు. ఇతను రోజు ఒక రూపాయి బిచ్చం వేసేవాడు. రెండు సంవత్సరాలు అయిన తర్వాత అర్ధ రూపాయి వెయ్యడం ప్రారంభించాడు . మళ్ళీ రెండు సంవత్సరాలు అయిన తర్వాత పావలా ఇవ్వడం మొదలు పెట్టాడు. 



ఆ ముష్ఠి వాడు అయ్యా మీరు ఒకప్పుడు నాకు రూపాయి ఇచ్చేవారు, తర్వాత కొద్ది కాలానికి అర్ధరూపాయి ఇవ్వడము మొదలుపెట్టారు, ఇహ ఇప్పుడు మరీ ఘోరంగా పావలాయే ఇస్తున్నారు . ఇట్లా అయితే మేము ఎట్లా బ్రతుకుతామయ్యా  అని అడిగాడు.



దానికి ఆ ఉద్యోగి నాకు ఉద్యోగం వచ్చిన క్రొత్తలో నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నీకు రూపాయి ఇచ్చాను, తర్వాత నాకు పెళ్లి అయ్యింది. నా భార్య వలన కొంత కర్చు పెరిగింది, కాబట్టి అర్ధ రూపాయి ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు , మళ్ళీ కర్చు పెరిగింది కాబట్టి ఇప్పుడు పావలా ఇస్తున్నాను. అయినా నా భార్య బిడ్డలను నేను పోషించుకోవద్దా? అన్నాడు.



ఆ బిచ్చగాడు కోపంతో ఊగిపోతూ అంటే నాడబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషించుకుంటున్నావా? నీకు సిగ్గులేదు అన్నాడు.

Thursday, 1 December 2011

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ ని అయినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే !!!


ఈ తెలుగు చిత్ర సీమలో ఎందరో కథానాయకులు ఉండగా నేను విక్టరీ వెంకటేష్ అభిమానిని అయ్యాను. మిగతా హీరోలు ఎంత చక్కగా ఎడ్వ టైస్ మెంట్స్  ఇస్తున్నారో చూడండి .

నాగార్జున అక్కినేని  కల్యాణి జ్యూవలర్స్ని ప్రోస్తాహిస్తూ  తన అభిమానులను మరియు తెలుగు ప్రేక్షకులను ఉత్సాహ పరుస్తున్నాడు.

మహేష్ బాబు జోయల్క్కాస్ కొనమని గోల పెడుతున్నాడు.

జూనియర్ ఎం టి ఆర్ కూడా మలబార్ గోల్డె మంచిది అంటున్నాడు.

చివరికి అప్పులలో ఉన్నాను అంటున్న జగపతి బాబు కూడా సి ఎం ఆర్ బంగారమే కొనండి అంటున్నాడు. ( ఈయన దరిద్రం ఏమిటంటే ఆ యాడ్ కి సంబంచిన ఒక్క ఫోటో కూడా దొరకలేదు)


వాళ్ళందరూ కొను కొను అని ప్రోస్తాహిస్తుంటే మరి మనవాడు తాకట్టు పెట్టమని/అప్పులు చేయమని ఢంకా భజాయించి చెప్పుతున్నాడు.



కొసమెరుపు: ఈ అప్పులు తీర్చుకోవాలంటే నాకు కొంత అప్పు కావాలి . ఎవరైనా అప్పు ఇస్తారా? but one thing it is not only my principle not to pay interest, but also my interest not to pay principal.

Sunday, 13 November 2011

అనగనగా ......




పూర్వాకాలంలో ప్రయాణాలు చాలా రోజులు చెయ్యాల్సి వచ్చేది . లాడ్జిలు కూడా ఉండేవి కావు , కాబట్టి ఎవరైనా ఒకరి ఇంట్లో ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చేది. ఒక యువకుడు అలాంటి ఒక ప్రయాణంలో ఉండి చీకటి పడేటప్పటికి ఒక ఊరు చేరుకున్నాడు . ఆ రాత్రికి అక్కడ బస చేద్దామనిచేప్పి ఒక ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు , ఆ ఇంటి యజమానితో విషయం చెప్పాడు , దానికి ఆయన బాబు మా ఇంటిలో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ప్రక్క ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ యువకుడు ప్రక్క ఇల్లు తట్టి, సంగతి చెప్పాడు దానికి ఆ గృహస్తు బాబు మా ఇంటిలో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు ఇంకొక ఇల్లు చూసుకో అన్నాడు. ఇలా చాలా ఇల్లు తట్టాకా ఆ యువకుడికి చాలా విసుగు వచ్చింది . చివరకు ఒక ఇల్లు తలుపులు తట్టి , ఆ ఇంటి ఆయనతో మీ ఇంట్లో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారా? అని అడిగాడు. ఆయన ఉన్నారు ,ఎందుకు? అని అడిగాడు. ఏమిలేదు ఈ రాత్రి మీ ఇంట్లో గడుపుదామని చెప్పాడు.


ఒక యువతీ గాంధీ హాస్పిటల్ లిఫ్ట్ లో బిడ్డను ప్రసవించింది. అందరు ఆవిడను వింతగా చూస్తుంటే ఆవిడ సిగ్గు పడి, ఏడవడము ప్రారంభించింది. ఒక నర్సు ఆవిడను ఊరడిస్తూ ," దీనికే అంత ఇది అవుతే ఎలా? నీకు తెలుసా రెండు ఏండ్ల క్రితం ఒకావిడ ఏకంగా గేటు దగ్గరే ప్రసవించింది" అన్నది. దానికి ఆవిడ , " తెలుసు ,అది కూడా నేనే " అంది మరింత బిగ్గరగా ఏడవడము మొదలు పెట్టి. 

Thursday, 3 November 2011

గుజరాతీ రక్తము







ఒక అరబ్బు షేకుకు ముంబై లో ఆపరేషన్ జరిగింది . ఆయనది చాలా చాలా అరుదైన రక్తము . ఆ రక్తము గురించి చాలా ప్రయత్నాలు చేసారు . చివరకు ఒక గుజరాతీ రక్తము సరిపోయింది.
ఆ గుజరాతీ రక్తము ఇచ్చినందుకు ఆ షేకు అతనికి పది లక్షలు డబ్బు , ఒక వజ్రాల ఉంగరము , ఒక బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు . గుజరాతీ ఎంతో సంతోషించాడు .
సరిగ్గా ఒక  సంవత్సరము తర్వాత మళ్లీ ఆ షేకుకు  ముంబై లోనే  ఆపరేషన్ జరిగింది. మళ్లీ రక్తము అవసరము అయితే ఆ గుజరాతీ వచ్చి రక్తము ఇచ్చాడు ,  ఈ సారి ఇంకా ఎన్ని బహుమతులు ఇస్తాడో అని అతను మనసులో అనుకున్నాడు.
ఆపరేషన్ అయిన తర్వాత షేకు ఒక కిలో మిఠాయి ఇచ్చాడు .
గుజరాతీకి కోపం వచ్చి , " పోయిన సారి అంత డబ్బు , విలువైన నగలు ఇచ్చావు , ఈ సారి ఏంటి కేవలం స్వీట్స్ తో సరిపెట్టావు " అని అన్నాడు .
అందుకు షేకు "అప్పుడంటే నాది అరబ్బు రక్తము కాబట్టి అలా ఇచ్చాను , కాని ఇప్పుడు గుజరాతీ రక్తము గదా " అన్నాడు .

Sunday, 30 October 2011

నాగ రాజును నేనే


మొన్న ఉదయము టి వి లో చంద్రకళ "నోము పండించావా స్వామి " అని పాడుతుంటే చూస్తున్నాను , ఇంతలో మా ఆవిడ ఒక గ్లాస్ నిండా పాలు తెచ్చి తాగమంది, నేను కాఫీ అడిగాను , కాని ఆవిడా పాలే త్రాగమని బలవంతం చేస్తే సరే అని తాగాను . 
ఆ తర్వాత ఏంటి ఈ రోజు పాలు ఇచ్చావు అన్నాను , ఈ రోజు నాగుల చవితి గదండి అన్నది.

Saturday, 24 September 2011

పెద్ద పులి పెండ్లి విందు .

పెద్ద పులి పెండ్లి విందు .
అడవిలో పెద్దపులి పెండ్లి అయ్యింది, అంతా విందుకు రిసెప్షన్ హాల్ కి వచ్చారు . పెండ్లి కుమార్తె బట్టలు మార్చుకొనుటకు వెళ్ళింది . పెండ్లి కుమారుడు ఐన పులి పెండ్లి కుమార్తె గురించి ఎదురు చూస్తున్నది , అందరు కూడా పెండ్లి కుమార్తె గురించి ఎదురు చూస్తున్నారు . ఇంతలో ఒక పిల్లి వచ్చి స్టేజి మీద డాన్సు చేయడం మొదలు పెట్టింది .









పెద్దపులికి కోపం వచ్చింది , వెళ్లి ఆ పిల్లి పీక పట్టుకొని ఎవరునువ్వు అని కోపంగా అడిగింది.









 దానికి పిల్లి నేను కూడా పులినే ... పెండ్లికి ముందు అన్నది .