Monday, 3 June 2013

ఆ ఆలోచనకే చేతులెత్తి నమస్కరిస్తున్నాను




"ఈ రోజు ఈనాడు లోని ఒక వార్త ఎక్కువ మంది అమ్మాయిలు ప్రేమ పేరుతో ఇంట్లో నుండి పారిపోతున్నారు"

 విదేశాలలో ముఖ్యముగా పాశ్చాత్య దేశాలలో పెళ్ళికి ముందు కలిసి తిరగడం అనే సంస్కృతి ఉన్నది. దీనిని పెళ్ళికి ముందు ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడానికి అనే ముసుగులో వారి లైంగిక విశౄంఖలత్వమును ప్రదర్శిస్తున్నారు . వారిలో ఎంత మంది వివాహము చేసుకుంటున్నారు ,ఒక వేళ పెళ్లి చేసుకున్నా , అలా అర్ధం చేసుకుని చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని నిలుస్తున్నాయి?




అయినా వారికి అర్ధం కానిది ఆశ్ఛర్యం కలిగించేది మన వివాహ పద్దతి . మన దేశంలో పెళ్ళికి ముందు పెద్ద పరిచయము లేకుండా , ఒకరిని ఒకరు అర్ధం చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది వారికి అనాగరికము లాగా కనిపిస్తుంది . అంతే గాని మన వివాహాల విజయ శాతమును వాళ్ళు గుర్తించడము లేదు . వాటి వెనుక ఉన్న మూల సూత్రాలను గుర్తించడము లేదు . భార్యాభర్తల  మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ జీవితాంతము కలిసి ఉండాలనే ఆ ఆ ఆలోచనకే చేతులెత్తి నమస్కరిస్తున్నాను



ఈ నాడు మనలో కూడా విడాకుల సంఖ్య పెరిగి పోతున్నదంటే కొంత వరకు పాశ్చాత్య సంస్కృతి ప్రభావము ఉన్నది . ఈ ప్రభావము కేవలం పిల్లలలోనే కాదు తల్లితండ్రుల మీద కూడా ఉన్నది . తల్లితండ్రులు గత తరం వారిలాగా కాక నాగరికత పేరుతొ స్వేచ్ఛ నిస్తున్నారు . ( నేటి సినిమా లలోను, వ్యాపార ప్రకటన లలోను ఈ ధోరణి బాగా కనపడుతున్నది . కొత్తగా వస్తున్న పారగాన్ చెప్పుల ప్రకటనలో కొడుకు తన స్నేహితురాలితో సినిమాకి వెళ్ళడానికి తండ్రిని చెప్పులు అడగడం ) 

Photo courtesy : Google

1 comment:

  1. కొన్ని సంప్రదాయాలవల్ల మనదేశంలో వివాహ వ్యవస్థ దృఢముగా కొనసాగుతున్నది.కొన్ని విషయాలలో రాజీపడి విచ్ఛిన్నం కాకుండా చూసుకుంటున్నారు,పొసగకపోతే కొందరు విడాకులు తీసుకుంటున్నారు అరుదుగా ఆయినప్పటికీ!పాశ్చాత్య విద్యా ప్రభావం వల్ల కాలంతెస్తున్న మార్పులు ధోరణులు పెరిగి సమాజంలో కొన్ని స్వేచ్చా వాయువులు వీస్తున్నాయి,స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం సమకూరి తన నిర్ణయాలు తాను స్వయంగా తీసుకోగలుగుతున్నది.కొంత సమానత్వం సాధించగలుగుతున్నది!ఈ పరిణామాలు మనం అతి జాగ్రత్తగా గమనిస్తే సమాజ స్వరూపం ద్యోతకమవుతుంది!

    ReplyDelete