Thursday, 29 September 2011

ముళ్ళపూడి వెంకట లమణ/ఒక్క వివరణ మా ఆలోచనలనే మార్చేసింది .

ఎమ్విఎల్ ఈయన ఎవరో తెలుసా? నూజివీడు కాలేజీ లో తెలుగు బోధకులుగా పనిచేసారు (1970 -1980 దశకములలో). ఎమ్విఎల్ పేరుతొ ఒక వార పత్రికలో బహుశా ఆంధ్ర జ్యోతి అనుకుంటా ప్రశ్నలు జవాబుల శీర్షికను నడిపేవారు. ఈయన హాస్య శైలిని చూసి  అనేక మంది ఈయనే ముళ్ళపూడి వెంకట రమణ అనుకునే వారు , అలాగే ఒకాయన మీరు ముళ్ళపూడి వెంకట రమణ ఐతే ఎం వి ఆర్ అని పెట్టుకోవాలిగాని ఎమ్విఎల్ అని ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నిస్తే , దానికి జవాబుగా నేను బుడుగును కదా నాకు రమణ అని పలకడం రాక లమణ అని పలుకుతాను కాబట్టి నేను ఎమ్విఎల్ అని రాసుకుంటాను అన్నారు . మన హాస్య బ్రహ్మః జంద్యాల లాగ ఈయన కూడా చిన్న వయసులోనే అనుకోకుండా చనిపోయ్యారు . 
ఒక సారి మా కాలేజీకి ముఖ్య అతిదిగా వచ్చారు . బహుశా మా తెలుగు బోధకులుతో ఉన్న అనుబంధము వలన ఐయిఉండవచ్చు ! ఆయన ఎవరో తెలుసా పరుచూరి గోపాలకృష్ణ !!! ఏంటి పండిత పుత్రా పరమ శుంఠ అనే కాదు పండిత శిష్య పరమ శుంఠ అంటున్నారా , మరి పరమానందయ్య శిష్యుల సంగతి మర్చిపోయ్యరా .
ఆ సమయములో ఆయనతో కొద్దిసేపు గడిపే అవకాశము వచ్చింది . ఆయన ఆడదంటే అలుసా( నిజం గానే అలుసు అనిపిస్తది ఆ సినిమా చూస్తే) అనే సినిమా లోని పాట " చెన్న పట్నం చిన్నదానిని చైనా బజారులో ఉన్నదానిని , పూల దుకాణం దాటి   పాలా డిపో మీదుగా , అట్టట్ట దిగి వస్తే అక్కడే మా ఇల్లు " దాని లోని అర్ధమును వివరించే టప్పటికి మాకు చాలా జ్ఞానోదయం ఐయినది . ఇహ అప్పటి నుండి కోడి గుడ్డుకు ఈకలు పీకడం మొదలుపెట్టి జంద్యాల గారు నాలుగు స్తంభాలాట సినిమా తీస్తే ఆ సినిమా పేరుని మార్చాలని , అంత బూతు పేరు ఎలా పెట్టారని గొడవ చేసాము. ఒక్క వివరణ మా ఆలోచనలనే మార్చేసింది .
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే ఏమిలేదు . కాని ఈ   ఎమ్విఎల్ గారి గురించి ఎవరైనా ఇంకా వివరములు ఇవ్వగలరా ???
అదీ నా బాధ , అర్ధమైనది గదా?

Saturday, 24 September 2011

పెద్ద పులి పెండ్లి విందు .

పెద్ద పులి పెండ్లి విందు .
అడవిలో పెద్దపులి పెండ్లి అయ్యింది, అంతా విందుకు రిసెప్షన్ హాల్ కి వచ్చారు . పెండ్లి కుమార్తె బట్టలు మార్చుకొనుటకు వెళ్ళింది . పెండ్లి కుమారుడు ఐన పులి పెండ్లి కుమార్తె గురించి ఎదురు చూస్తున్నది , అందరు కూడా పెండ్లి కుమార్తె గురించి ఎదురు చూస్తున్నారు . ఇంతలో ఒక పిల్లి వచ్చి స్టేజి మీద డాన్సు చేయడం మొదలు పెట్టింది .









పెద్దపులికి కోపం వచ్చింది , వెళ్లి ఆ పిల్లి పీక పట్టుకొని ఎవరునువ్వు అని కోపంగా అడిగింది.









 దానికి పిల్లి నేను కూడా పులినే ... పెండ్లికి ముందు అన్నది . 

Saturday, 17 September 2011

నన్ను నమ్మండి !!! నేను వైద్యుడను కాదు !!! 4

25 గుండెను కాపాడే మంచి ఆహార పదార్ధాలు
5 . చిక్కుడు గింజలు - రాజ్మా , కిడ్నీ బీన్స్ అని పిలువబడే అనేక రకాల చిక్కుడు గింజలు దొరుకుతాయి . బి కాంప్లెక్స్ విటమిన్స్ ,నియసిన్ ,ఫోలేట్, మెగ్నీషియం, ఒమేగా 3  ఫాట్టి ఆసిడ్స్ , కాల్సియం మరియు పీచు పదార్ధం ఉంటాయి .

6 . బాదం పప్పు - వీటిని ఇంగ్లీష్ లో Almonds  అంటారు . వీటిలో ఒమేగా 3  ఫాట్టి ఆసిడ్స్, విటమిన్ ఇ, మెగ్నీషియం, పీచు పదార్ధం మరియు గుండెకు మేలు చేసే మోనో మరియు పోలి అన్ శాచ్చురేటెడ్ క్రొవ్వు మరియు పైటో స్తేరోల్స్ ( Phytosterols ) ఉంటాయి . రోజు 3 -5  పచ్చిగా తీసుకుంటే మంచిది.

7 . అక్రూట్ - వీటిని Walnuts అంటారు . వీటిలో ఒమేగా 3  ఫాట్టి ఆసిడ్స్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫోలేట్ ,పీచు పదార్ధం మరియు గుండెకు మేలు చేసే మోనో మరియు పోలి అన్ శాచ్చురేటెడ్ క్రొవ్వు మరియు పైటో స్తేరోల్స్ ( Phytosterols ) ఉంటాయి . వీటిని గూడా రోజు 2 -3 పచ్చిగానే తింటే మంచిది.

8 . ఎర్ర ద్రాక్ష వైన్ - Red Wine అలవాటు ఉన్నవాళ్ళు కొద్దిగా తీసుకుంటే మంచిది . దీనిలో ఫ్లావ నోఇడ్స్ ఉంటాయి మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెరిగే టట్లు చేస్తుంది.

9 . బ్రౌన్ రైస్ - మనము దంపుడు బియ్యం అంటాము. ఇది ఆరోగ్యానికి చాలా చాల మంచిది. బి కాంప్లెక్స్ విటమిన్స్ ,నియసిన్ , మెగ్నీషియం, పీచు పదార్ధం ఉంటాయి .

10 . సోయా మిల్క్ - soya  Milk లో ఫ్లావ నోఇడ్స్ ,బి కాంప్లెక్స్ విటమిన్స్ ,నియసిన్,ఫోలేట్, మెగ్నీషియం,  కాల్సియం , పోటాషియం మరియు పైటో స్తేరోల్స్ ( Phytosterols )  ఉంటాయి .
                                                                                                                                      ఇంకా ఉంది .........

Friday, 16 September 2011

నన్ను నమ్మండి !!! నేను వైద్యుడను కాదు !!! 3

గుండెకు మేలు చేసే 25 మంచి ఆహార పదార్దములు

1 .  సాల్మోన్ చేప - ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ అత్యధికముగా ఉంటాయి, వారానికి రెండు సార్లు తినవచ్చు .


2 . టూన చేప - ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్  అధికముగా ఉంటాయి, Folate (విటమిన్ బి 12 ) రక్తము గడ్డ కట్టుటను అరికడతాయి, రక్త నాళాలు గట్టి పడకుండా కాపాడుతాయి, నియసిన్ (విటమిన్ బి 3 ) మంచి కొలెస్ట్రాల్ ను  పెంచుతాయి.

3 . అవిసె గింజలు (Flax  Seeds ) -  ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ అత్యధికముగా ఉంటాయి, పీచు పదార్ధము ఉంటాయి  మరియు phytoestrogens ఉంటాయి . వీటిని రోజుకు  ఒకటి లేదా రెండు చెంచాలకన్నా ఎక్కువ తీసుకోగూడదు మరి ముఖ్యముగా పచ్చివి తీసుకోగూడదు , కొంచం వేయించి తీసుకోవాలి . మూడు పదార్ధాలు ఉండుట వలన
ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్  వలన వచ్చే లాభాలు మరియు phytoestrogens వలన వచ్చే లాభాలు చాలా చాలా అధికము , కాబట్టి ఇవి గుండెకు చాలా మంచివి . మరియు పీచు పదార్ధము వలన వచ్చే లాభాలు మరింత అధికం . అవిసె గింజలు తెల్లవి మరియు గోధుమ రంగువి (బ్రౌన్) బజారులో దొరుకుతాయి , ఏవి రెండూ కూడా సమానమే , ఏవి వాడినా ఒకటే .

4 . ఓట్ మీల్ (Oat meal ) - ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్  , మెగ్నీషియం , పోటాషియం, Folate (విటమిన్ బి 12 ), నియసిన్ (విటమిన్ బి 3 ), కాల్సియం మరియు పీచు పదార్ధము ఉంటాయి. వీటిని బట్టి దీని ఉపయోగం ఏమిటో ఆలోచించండి . మార్కెట్ లో  ఓట్ మీల్ బిస్కట్స్ కూడా దొరుకుతున్నాయి .
                                                                                                                                  ఇంకా ఉంది .....

నన్ను నమ్మండి !!! నేను వైద్యుడను కాను !!! 2

గుండెకు మేలు చేసే 25 ఆహారములు
Phytosterols  - ఇవి రసాయనకముగా కొలెస్టరాల్ మాదిరిగా ఉంటాయి. రక్తములో ఉండే కొలెస్టరాల్ని తగ్గిస్తాయి . గింజ పప్పులు (nuts), గింజలులో ఇది ఎక్కువగా ఉంటుంది.
Cerotenoids  - ఇవి గుండెకు రక్షణనిచ్చే antioxidants ఇవి రంగు రంగుల పండ్లు కూరగాయలలో ఉంటాయి . Alpha cerotene , Beta cerotene , Luiten Lycopene  మొదలగునవి Cerotinoids .

పోలిఫినోల్స్  - ఇవి కూడా  ఆంటి ఆక్సిడెంటులు (Antioxidants) రక్త నాళాలను కాపాడుతాయి , రక్త పోటును  మరియు చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి . ఇవి రెండు రకాలు 1 . ఫ్లావనాయిడ్స్ ( టీ లో ఉంటాయి )  2 .  నాన్  ఫ్లావనాయిడ్స్ ( అన్ని రకాల బెర్రీ పళ్ళలో ఉంటాయి )
ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ - రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి, రక్తము గడ్డ కట్టుటను అరికడతాయి , గుండె పోటు నుండి  కాపాడుతాయి , మంచి కొలెస్ట్రాల్ ను  పెంచుతాయి , ట్రై గ్లిసరైడ్స్ ను తగ్గిస్తాయి , రక్త నాళాలులో  పలకలు (plaque) ఏర్పడకుండా కాపాడుతాయి, రక్త పోటును తగ్గిస్తాయి మరియు anti  inflammatories అంటే నొప్పిని , మంటను తగ్గిస్తాయి .
బి   కాంప్లేక్సు  విటమినులు  - రక్తము గడ్డ కట్టుటను అరికడతాయి, రక్త నాళాలు గట్టి పడకుండా కాపాడుతాయి  మరియు మంచి కొలెస్ట్రాల్ ను  పెంచుతాయి.
సి  మరియు ఇ  విటమినులు - రక్త పోటును తగ్గిస్తాయి మరియు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
                                                                                                                      అసలైనది  ఇంకా ఉంది .......

నన్ను నమ్మండి !!! నేను వైద్యుడను కాను !!!

  గుండెకు మేలు చేసే 25 ఆహారములు




మన గుండెను కాపాడుకోవడానికి మరణ కరమైన గుండె జబ్బుల నుండి రక్షించుకోవడానికి మరి ముఖ్యముగా గుండె పోటు  నుండి తప్పించు కోవడానికి తీసుకోవలసిన ఆహారము గురించి తెలుసుకుందాము


ఇవి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హృదయ నిపుణులచే సూచించబడ్డాయి. వీటిని ప్రతి దినము మన ఆహారములో చేర్చుకుంటే చాలా మంచిది . కేవలము మందులతోనే గాక మంచి ఆహారపు అలవాట్ల వలన మన గుండెను ఆరోగ్యమును కాపాడు కోగలుగుతాము. దీనిని మన పూర్వికులు ఎప్పుడో చెప్పారు , ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా ఆయుర్వేదమునకు మంచి ఆదరణ ఉన్నది . అదే విధముదీనిని మన పూర్వికులు ఎప్పుడో చెప్పారు , ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా ఆయుర్వేదమునకు మంచి ఆదరణ ఉన్నది . అదే విధముగా ప్రపంచ దేశాల వైద్యులందరూ దీనిని గుర్తించి  ఆ ఆయుర్వేద వైద్యమును చిట్కాల రూపములో (సలహా) ఇస్తున్నారు . అలా ఇవ్వ బడినవే ఇవి . ఉదాహరణకు రోజు ఉదయాన లేవగానే ఒక వెల్లుల్లి రెబ్బను తింటే గుండె పోటును  నివారించవచ్చు. Readers Digest 2009 జూన్ నెల సంచికలో 120 వ పేజిలో వైద్యుడు  అశోక్ జింఘన్ , ఢిల్లీ డయాబెటిక్ సెంటర్ ఇలా అన్నారు , " ప్రతి రోజు ఉదయము నిద్ర లేవగానే మొట్ట మొదటగా ఒక వెల్లుల్లి రెబ్బ తింటే క్రొవ్వు (చెడ్డ కొలస్త్రాల్ ) ని నివారించ వచ్చు".
గుండెకు ఆరోగ్యమునిచ్చు పోషకాలు Phytoestrogens  ఇవి మొక్కలలో ఉంటాయి ఉదాహరణకు అవిసె గింజలు 
రక్తమును గడ్డకట్టకుండా, గుండె పోటు మరియు గుండె పట్టుకొనుట మొదలగు సమస్యలను తగ్గిస్తుంది .
ఇది అంత మాత్రమే కాదు కొలెస్ట్రాల్ , ముఖ్యముగా చెడ్డ కొలెస్ట్రాల్ ని , ట్రై గ్లిసరైడ్స్ మరియు రక్త పోటును తగ్గిస్తుంది                                                                                                              ఇంకా ఉంది ....