Tuesday, 15 November 2011
Monday, 14 November 2011
చాయ్ గరం బిస్కెట్ నరం కానే వాలా బేషరం
రోజూ కొన్ని కప్పుల టీ త్రాగడము మంచిది , ఎందుకంటే టీ ఆకులలో ఆంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.
టీ తయారు చేసే విధానమును బట్టి మూడు రకముల టీ లు ఉన్నాయి.
అవి బ్లాకు టీ, గ్రీన్ టీ మరియు ఊలంగ్ టీ .
అల్లాగే గర్భిణీ స్త్రీలు , పాలిచ్చు తల్లులు గ్రీన్ టీ ఎక్కువగా త్రాగకూడదు.
బ్లాకు టీ భోజనముతో గాని భోజనము అయిన వెంటనే గాని తీసుకుంటే , ఆహారములోని ఇనుమును శరీరము అస్సలు గ్రహించదు, కాబట్టి భోజన సమయములో టీ తీసుకోకూడదు.
టీ తయారు చేసే విధానమును బట్టి మూడు రకముల టీ లు ఉన్నాయి.
అవి బ్లాకు టీ, గ్రీన్ టీ మరియు ఊలంగ్ టీ .
బ్లాకు టీ అంటే గాలిలో ఎండబెట్టడము లేక కుళ్ళ బెట్టడము , గ్రీన్ టీ అంటే ఆవిరిలో ఉడకబెట్టుట, ఊలాంగ్ టీ అంటే కొంచం కుళ్ళ బెట్టడము ఇటువంటి ప్రక్రియల ద్వారా టీ లను తయ్యారు చేస్తారు.
గ్రీన్ టీ తీసుకోవడము వలన గుండెకు మేలు జరుగుతుంది. ఎలాగంటే శరీరపు బరువు, కొలెస్ట్రాల్ మరియు రక్త పోటు తగ్గి గుండెకు మేలు చేస్తుంది.
అంతే కాక గ్రీన్ టీ చక్కరను నియంత్రించుటలో సహాయ పడుతుంది.
హెర్బల్ టీలు కేమేల్లియా సేనసిస్ (టీ ఆకులు)తో తయారు చేయబడవు కాబట్టి అవి అసలు టీలే కాదు మరియు టీ ద్వారా వచ్చే ఏ లాభాలు వాటి వలన రావు.
టీలో ఆంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా పొందాలంటే , టీ కాచిన తర్వాత మూడు నుండి ఐదు నిముషాలు టీ సారం దిగులాగున ఉంచాలి .
ఐస్ టీ వేడి టీ అంత మంచిది కాదు.
(గ్రీన్) టీ పిల్లలలో ఎలాంటి ప్రభావము చూపిస్తుందో ఇంత వరకు తెలియదు, ఎందుకంటే టీ పై పెద్దలలోనే గాని పిల్లలపై ఇంత వరకు పరీక్షీంచలేదు లేదు.
బ్లాకు టీ భోజనముతో గాని భోజనము అయిన వెంటనే గాని తీసుకుంటే , ఆహారములోని ఇనుమును శరీరము అస్సలు గ్రహించదు, కాబట్టి భోజన సమయములో టీ తీసుకోకూడదు.
Sunday, 13 November 2011
హైదరాబాద్ ఆటోనా మజాకా
మేడ్ ఇన్ జపాన్
ఒక జపాన్ టూరిస్ట్ హైదరాబాద్ వచ్చి ఆటో ఎక్కి సిటీ చూస్తున్నాడు. మీ ఇండియాలో కార్లు ఎంత మెల్లిగా నడుస్తున్నాయి అదే జపాన్లో అయితేనా ఎంత వేగముగా వెళతాయో తెలుసా? అన్నాడు. మళ్లీ ఏంటి మీ బస్ లు ఇంట స్లో గా ఉన్నాయి అదే జపాన్లో అయితేనా? అన్నాడు. మళ్లీ కొంచం దూరము వెళ్ళిన తర్వాత మీ మోటార్ సైకిళ్ళు ఎంత నిదానముగా వెళ్ళుతున్నాయి అదే జపాన్ లో అయితేనా? అన్నాడు. చివరికి దిగేటప్పుడు మీటరు చూసి షాక్ తిని ఏంటి మీ మీటరు ఇంట ఫాస్టుగా తిరుగుతుంది అన్నాడు. ఈ మీటరు మేడ్ ఇన్ జపాన్ అని జవాబిచ్చాడు ఆటోవాలా .
ఒక జపాన్ టూరిస్ట్ హైదరాబాద్ వచ్చి ఆటో ఎక్కి సిటీ చూస్తున్నాడు. మీ ఇండియాలో కార్లు ఎంత మెల్లిగా నడుస్తున్నాయి అదే జపాన్లో అయితేనా ఎంత వేగముగా వెళతాయో తెలుసా? అన్నాడు. మళ్లీ ఏంటి మీ బస్ లు ఇంట స్లో గా ఉన్నాయి అదే జపాన్లో అయితేనా? అన్నాడు. మళ్లీ కొంచం దూరము వెళ్ళిన తర్వాత మీ మోటార్ సైకిళ్ళు ఎంత నిదానముగా వెళ్ళుతున్నాయి అదే జపాన్ లో అయితేనా? అన్నాడు. చివరికి దిగేటప్పుడు మీటరు చూసి షాక్ తిని ఏంటి మీ మీటరు ఇంట ఫాస్టుగా తిరుగుతుంది అన్నాడు. ఈ మీటరు మేడ్ ఇన్ జపాన్ అని జవాబిచ్చాడు ఆటోవాలా .
అనగనగా ......
పూర్వాకాలంలో ప్రయాణాలు చాలా రోజులు చెయ్యాల్సి వచ్చేది . లాడ్జిలు కూడా ఉండేవి కావు , కాబట్టి ఎవరైనా ఒకరి ఇంట్లో ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చేది. ఒక యువకుడు అలాంటి ఒక ప్రయాణంలో ఉండి చీకటి పడేటప్పటికి ఒక ఊరు చేరుకున్నాడు . ఆ రాత్రికి అక్కడ బస చేద్దామనిచేప్పి ఒక ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు , ఆ ఇంటి యజమానితో విషయం చెప్పాడు , దానికి ఆయన బాబు మా ఇంటిలో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ప్రక్క ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ యువకుడు ప్రక్క ఇల్లు తట్టి, సంగతి చెప్పాడు దానికి ఆ గృహస్తు బాబు మా ఇంటిలో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు ఇంకొక ఇల్లు చూసుకో అన్నాడు. ఇలా చాలా ఇల్లు తట్టాకా ఆ యువకుడికి చాలా విసుగు వచ్చింది . చివరకు ఒక ఇల్లు తలుపులు తట్టి , ఆ ఇంటి ఆయనతో మీ ఇంట్లో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారా? అని అడిగాడు. ఆయన ఉన్నారు ,ఎందుకు? అని అడిగాడు. ఏమిలేదు ఈ రాత్రి మీ ఇంట్లో గడుపుదామని చెప్పాడు.
ఒక యువతీ గాంధీ హాస్పిటల్ లిఫ్ట్ లో బిడ్డను ప్రసవించింది. అందరు ఆవిడను వింతగా చూస్తుంటే ఆవిడ సిగ్గు పడి, ఏడవడము ప్రారంభించింది. ఒక నర్సు ఆవిడను ఊరడిస్తూ ," దీనికే అంత ఇది అవుతే ఎలా? నీకు తెలుసా రెండు ఏండ్ల క్రితం ఒకావిడ ఏకంగా గేటు దగ్గరే ప్రసవించింది" అన్నది. దానికి ఆవిడ , " తెలుసు ,అది కూడా నేనే " అంది మరింత బిగ్గరగా ఏడవడము మొదలు పెట్టి.
Tuesday, 8 November 2011
Monday, 7 November 2011
చికాగో సర్వ మత సమ్మేళనములో వివేకానందుని ప్రసంగము
శివరామప్రసాదు కప్పగంతు గారి వివేకానంద వాణి ప్రేరణతో
1893 సెప్టెంబర్ 11 నుండి 27 వరకు చికాగో లో జరిగినవి . వివేకానందుడు సెప్టెంబర్ 11,15,19,20,26 మరియు 27 మొత్తము 6 ప్రసంగాలు చేసారు . అందులో ముఖ్యమైనది 19 తారీఖున చేసిన ప్రసంగము. ఆయన ప్రసంగములలోని ముఖ్య అంశము విశ్వ ఐక్యత మరియు పరమత సహనము. కాబట్టి భారతీయులమైన మనము ఆయనను గౌరవించడము మన భారత భూమిని గౌరవించడమే , మనము ఏ మతస్తులము అయినా సరే మనమందరమూ భారతీయులమే ,ఇది మనము గుర్తు ఉంచుకోవాలి. తన స్వంత దేశమును ద్వేషించమని చెప్పే మతము ఎవ్వరికి సమ్మతము కాదు.
1893 సెప్టెంబర్ 11 నుండి 27 వరకు చికాగో లో జరిగినవి . వివేకానందుడు సెప్టెంబర్ 11,15,19,20,26 మరియు 27 మొత్తము 6 ప్రసంగాలు చేసారు . అందులో ముఖ్యమైనది 19 తారీఖున చేసిన ప్రసంగము. ఆయన ప్రసంగములలోని ముఖ్య అంశము విశ్వ ఐక్యత మరియు పరమత సహనము. కాబట్టి భారతీయులమైన మనము ఆయనను గౌరవించడము మన భారత భూమిని గౌరవించడమే , మనము ఏ మతస్తులము అయినా సరే మనమందరమూ భారతీయులమే ,ఇది మనము గుర్తు ఉంచుకోవాలి. తన స్వంత దేశమును ద్వేషించమని చెప్పే మతము ఎవ్వరికి సమ్మతము కాదు.
ఇంకా ఉంది
Friday, 4 November 2011
ఒక ఆడది హోం మంత్రిగా ఉన్న రాష్ట్రం లో వాళ్లకు ఉంగా ఉంగా బాష నేర్పాలి
శ్రీమతి సబితా ఇంద్ర రెడ్డి
అదొక కో ఎడ్యుకేషన్ కాలేజ్ , త్రిపుర సుందరి ( ఊరు పేరు వ్రాయక్కరలేదు త్రిపుర అంటే వరంగల్ , హన్మకొండ , కాజిపేట్ ) దగ్గరకు అనిల్ కపూర్ (తేజాబ్ హీరో తేజాబ్ అంటే ఆసిడ్ ) వచ్చాడు. వాడిని చూడగానే త్రిపుర మనసులో వీడు పగలు చూస్తే రాత్రికి కలలో వస్తాడు రాత్రి చూస్తే పగలు వాంతికి వస్తాడు అని అనుకుంది. వాడు నువ్వు నన్ను ప్రేమిస్తావా ? లేదా? అని సుత్తి లేకుండా నత్తిగా అన్నాడు . నువ్వు పగలు చూస్తే రాత్రికి కలలోకి వస్తావు అని అంది . వెంటనే వాడు ఆ రాత్రికి కలలోకి వస్తున్నానా అని మెలికలు తిరిగాడు . ఖర్మ నువ్వు అలా అర్ధం చేసుకున్నవా? అని నేను ప్రేమించను, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అంది . వెంటనే వాడు ఆసిడ్ తీసాడు, త్రిపుర సుందరి ఏ మాత్రం భయపడకుండా వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ " ఒక ఆడది హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో నువ్వు ఆడవాళ్ళ మీద ఆసిడ్ పోస్తావా?" అంది. వెంటనే వాడు ఆ బాటిల్ పడేసి "అమ్మా ఒక స్త్రీ గృహ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆడదాని మీద ఆసిడ్ పోసే దుర్మార్గుడిని కాను , ఏదో జనరల్ నాలెడ్జి తక్కువై వచ్చాను క్షమించు" అన్నాడు.
ఒక పార్కులో "గోపి నేను ఇప్పుడు గర్భవతిని, మనం వెంటనే పెండ్లి చేసుకుందాము "అని రాధ అన్నది, దానికి గోపి "హేంత పని చేసావు రాద్ధా, నేను నా భార్య గురించి ఎన్ని కలలు కన్నాను , నా కాబోయే భార్య ధనవతి కాకపోయినా పర్వాలేదు , గుణవతి కాకపోయినా పర్వాలేదు కాని గర్భవతి మాత్రం కాకూడదని అనుకున్నాను , ఇప్పుడు నిన్ను ఎలా పెళ్లి చేసుకోను " అన్నాడు . " ఏంటీ ఒక స్త్రీ గృహ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో నువ్వు మరొక స్త్రీని మోసం చేస్తావా?" అన్నది , "అరె ఆ విషయమే నేను మర్చిపొయ్యాను" అని పళ్ళు కొరుకుతూ పెళ్ళికి సిద్దమయ్యాడు గోపి.
ఒక ఇంట్లో భార్యను కట్నం కొరకు వేధిస్తున్న భర్త హోం మినిస్టర్ ఆడది అని గుర్తు చేయగానే భార్య కాళ్ళ మీద పడ్డాడు.
ఈ విధంగా ఒక స్త్రీ హోం మంత్రిగా ఉండడము వలన మన రాష్ట్రములో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు తగ్గిపోయినాయి.
కాని వైజాగ్ లో నలుగురు కామందులు ఒక పసిపాప మీద సామూహిక మానభంగం చేసారు . ఇక మన
తెలుగు టివిలు 1 -9 , A-Z లు చర్చ మొదలు పెట్టారు. అలాంటి ఒక చర్చలో "ఎందుకు ఔను కాదు" పార్టీ నాయకురాలు కూజా( కూర జాంబవతి) మాట్లాడుతూ "ఒక ఆడది హోం మినిస్టర్ గా ఉన్న రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద అత్యచారమా? అని ప్రశ్నించింది. అదే చర్చలో ఉన్న మరొక మేధావి , బహుశా ఆ పాప ఆ విషయమును వాళ్ళతో చెప్పి ఉండ వచ్చు కాని వాళ్లకి ఉంగా భాష రాక అర్ధం చేసుకోలేదు . కాబట్టి ఇలాంటి అత్యాచారాలను ఆపాలంటే ఉంగా భాషను వెంటనే అన్ని స్కూల్స్ లో నేర్పించాలి అని అన్నాడు.
(మొన్న వరంగల్ ఆసిడ్ దాడి అప్పుడు తెలుగు దేశం సారీ, కాంగ్రే ... క్షమించాలి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నేత రోజా ఆడది హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో అన్న మాట పై ఇది వ్రాసాను , కొస మెరుపు ఏంటంటే ఒక ఆడది హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ ఆడది మరొక ఆడదానిని (పనిపిల్లను) గారెలు సరిగా వేయలేదని వేడివేడి నూనెతో కాల్చింది)
Thursday, 3 November 2011
గుజరాతీ రక్తము
ఒక అరబ్బు షేకుకు ముంబై లో ఆపరేషన్ జరిగింది . ఆయనది చాలా చాలా అరుదైన రక్తము . ఆ రక్తము గురించి చాలా ప్రయత్నాలు చేసారు . చివరకు ఒక గుజరాతీ రక్తము సరిపోయింది.
ఆ గుజరాతీ రక్తము ఇచ్చినందుకు ఆ షేకు అతనికి పది లక్షలు డబ్బు , ఒక వజ్రాల ఉంగరము , ఒక బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు . గుజరాతీ ఎంతో సంతోషించాడు .
సరిగ్గా ఒక సంవత్సరము తర్వాత మళ్లీ ఆ షేకుకు ముంబై లోనే ఆపరేషన్ జరిగింది. మళ్లీ రక్తము అవసరము అయితే ఆ గుజరాతీ వచ్చి రక్తము ఇచ్చాడు , ఈ సారి ఇంకా ఎన్ని బహుమతులు ఇస్తాడో అని అతను మనసులో అనుకున్నాడు.
ఆపరేషన్ అయిన తర్వాత షేకు ఒక కిలో మిఠాయి ఇచ్చాడు .
గుజరాతీకి కోపం వచ్చి , " పోయిన సారి అంత డబ్బు , విలువైన నగలు ఇచ్చావు , ఈ సారి ఏంటి కేవలం స్వీట్స్ తో సరిపెట్టావు " అని అన్నాడు .
అందుకు షేకు "అప్పుడంటే నాది అరబ్బు రక్తము కాబట్టి అలా ఇచ్చాను , కాని ఇప్పుడు గుజరాతీ రక్తము గదా " అన్నాడు .
Subscribe to:
Posts (Atom)




























