Wednesday, 6 November 2013

శవానికి వైద్యమా?



ఆ మధ్య చిరంజీవి నాయకుడుగా వచ్చిన సినిమాలో శవానికి వైద్యం 

చేస్తూ డాక్టర్ లు చేసే హడావిడి చూశాము, ఆ తరువాత కరీం నగర్ లో 

ఒక హాస్పిటల్ లో శవానికి వైద్యం చేసినట్లు విన్నాము. కానీ ఇప్పుడు 

శవానికి వైద్యం చేస్తూ అది తప్పకుండా బ్రదుకుతుంది అని టీవీ లలో 

చెపుతుంటే నవ రసాల్లో ఏ హావభావాలు చూపాలో తెలియడం లేదు. 

విభజన జరిగిపోంది, అయినా కొంపలు ఏమీ మునిగి పోలేదు మా 

తడాకా చూపిస్తాము అంటే, మరి తెలంగాణా ప్రజల సంగతి ఏమిటి? 

Monday, 7 October 2013

వాళ్ళు TGలు వీళ్ళు TG లే

వాళ్ళు TG లు  అంటే తెలంగాణా మంత్రులు మరియు ఎంపీ లు, కాబట్టే బెదిరించో బామాలో పైన పడో  క్రిందపడో ప్రక్కనపడో సాధించారు.


మరి వీళ్ళు TG లు అంటే Third Gender , పిచ్చగా పచ్చిగా చెప్పాలంటే కొజ్జాలు.

Wednesday, 4 September 2013

జూనియర్ ఎన్ టి ఆర్ సినిమాకి చంద్ర బాబు వ్రాసిన డైలాగ్స్



బృందావనం సినిమా లోని ఈ డైలాగ్ చూడండి, కేరక్టెర్ కొత్త ఉందగాని ట్రై చేసా, కానీ ఒరిజినల్ అలాగే ఉంది.

తెలంగాణా ఇచ్చేయండి  ఇచ్చేయండి అని చంద్రబాబు  
 అంటే  ఏదో కేరక్టెర్ కొత్త ఉందగాని ట్రై చేసాడు ( నిజమను కున్నాను), కానీ ఒరిజినల్  సమైక్య వాదము  అలానే ఉంది








Wednesday, 12 June 2013

ముస్లిం ల సమస్య వలన అభి వృద్ది చెందిన హిందూ స్టేట్

 స్టేట్ జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశము , అక్కడి టెర్రరిస్ట్ ల సమస్య వలన పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ కి రావడం మొదలు పెట్టారు . ముఖ్యముగా గత పది పదిహేను సంవత్సరముల నుండి యాత్రికులు మనాలి కులు ప్రాంతాలకు వస్తున్నారు . సినిమా షూటింగ్ లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.




 హిమాచల్ లో హిందువుల జనాభా అధికము. ఇంకా చెప్పాలంటే హిందువుల తర్వాతి స్థానము  భౌద్ధవులది .

ఇప్పుడు కాశ్మీర్ కంటే హిమాచల్ పర్యాటకులతో కళ కళ లాడుతుంది . 





విచారకరమైన విషయము ఏమిటంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ల వలన కాశ్మీర్ నాశన మయినది . నేపాలీ రేపిస్ట్ ల వలన హిమాచల్ పేరు కూడా పాడ యే టట్లు ఉంది . మొన్ననే వీళ్ళు ఒక విదేశీ మహిళను మానభంగం చేసారు .

Pictures Courtesy Google

Tuesday, 11 June 2013

ఇది శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కుమార్తె ఇల్లు





నిజమే ఇది నిజంగా వాజ్ పేయి కుమార్తె ఇల్లే . పెళ్లి కాని వాజ్ పేయికి కుమార్తె ఎక్కడ నుండి వచ్చింది అని అనుకుంటున్నారా ?

 ఏమి సందేహము వద్దు ఆయన నికార్సు అయిన బ్రహ్మచారే 

 కాని ఆయన మనాలి లో ఒక హిమాచల్ బాలికను దత్తత తీసుకుని చాలా భాధ్యతా యుతంగా పెంచారు . మనాలి నుండి నగరికి వెళ్ళే మెయిన్ రోడ్ లో ఆయనకు ఒక ఐదు నక్షత్రాల హోటల్ ఉంది , దాని వెనుక ఆయన దత్త పుత్రిక ఇల్లు ఉంటుంది .

Monday, 3 June 2013

ఆ ఆలోచనకే చేతులెత్తి నమస్కరిస్తున్నాను




"ఈ రోజు ఈనాడు లోని ఒక వార్త ఎక్కువ మంది అమ్మాయిలు ప్రేమ పేరుతో ఇంట్లో నుండి పారిపోతున్నారు"

 విదేశాలలో ముఖ్యముగా పాశ్చాత్య దేశాలలో పెళ్ళికి ముందు కలిసి తిరగడం అనే సంస్కృతి ఉన్నది. దీనిని పెళ్ళికి ముందు ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడానికి అనే ముసుగులో వారి లైంగిక విశౄంఖలత్వమును ప్రదర్శిస్తున్నారు . వారిలో ఎంత మంది వివాహము చేసుకుంటున్నారు ,ఒక వేళ పెళ్లి చేసుకున్నా , అలా అర్ధం చేసుకుని చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని నిలుస్తున్నాయి?




అయినా వారికి అర్ధం కానిది ఆశ్ఛర్యం కలిగించేది మన వివాహ పద్దతి . మన దేశంలో పెళ్ళికి ముందు పెద్ద పరిచయము లేకుండా , ఒకరిని ఒకరు అర్ధం చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది వారికి అనాగరికము లాగా కనిపిస్తుంది . అంతే గాని మన వివాహాల విజయ శాతమును వాళ్ళు గుర్తించడము లేదు . వాటి వెనుక ఉన్న మూల సూత్రాలను గుర్తించడము లేదు . భార్యాభర్తల  మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ జీవితాంతము కలిసి ఉండాలనే ఆ ఆ ఆలోచనకే చేతులెత్తి నమస్కరిస్తున్నాను



ఈ నాడు మనలో కూడా విడాకుల సంఖ్య పెరిగి పోతున్నదంటే కొంత వరకు పాశ్చాత్య సంస్కృతి ప్రభావము ఉన్నది . ఈ ప్రభావము కేవలం పిల్లలలోనే కాదు తల్లితండ్రుల మీద కూడా ఉన్నది . తల్లితండ్రులు గత తరం వారిలాగా కాక నాగరికత పేరుతొ స్వేచ్ఛ నిస్తున్నారు . ( నేటి సినిమా లలోను, వ్యాపార ప్రకటన లలోను ఈ ధోరణి బాగా కనపడుతున్నది . కొత్తగా వస్తున్న పారగాన్ చెప్పుల ప్రకటనలో కొడుకు తన స్నేహితురాలితో సినిమాకి వెళ్ళడానికి తండ్రిని చెప్పులు అడగడం ) 

Photo courtesy : Google

Tuesday, 28 May 2013

Haunting Song

వెంబడించే పాట

ఒక పాత కథ గద్దర్ గారి పాట గురించి చదివాను. గద్దర్ గారి పేరు వెయ్యలేదు గాని , ఒక పెళ్లి బృందం బస్సు లో పెళ్ళికి వెళుతూ పాటలు పెట్టు కుంటారు ,అందరూ సరదాగా మాట్లాడు కుంటూ వెళ్తుంటారు. హఠాత్తుగా విప్లవ పాట వేసేసరికి అందరూ మౌనం అయిపోతారు . ఆ సాహిత్యం , స్వరము వాళ్ళను ఒక మైకం లోకి తీసుకువెలుతుంది .

ఆ కథలో లాగే నాకు ఈ పాట


నేను చదువుకునే రోజులలో ఒక సాయంత్రం ఎక్కడో దూరంగా మైకు లోంచి ఈపాటను విన్నాను. ఇది జాతర (1978)సినిమా లోనిది, ఎస్. పి. శైలజ గారు పాడారు . ఆ భావమును నేను వర్ణించలేను కాని ఒక అనిర్వచనీయ మైన అనుభూతి కలుగుతుంది . మనసంతా ఏదోలా అయిపోతుంది . గుండెలను పిండే భావన . నిజముగా అది ఏమిటో నాకే తెలియదు. పాట వినాలని మనసు ఉవ్విళ్ళు ఊరుతుంది ,కాని వింటే తట్టుకోలేను . ఇది నాకు ఇష్ట మైన పాట మాత్రము కాదు , అలా అని ఇష్టం లేదు అని చెప్పలేను .
కాని చాలా బాగుంటుంది .

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9001


ఇక్కడ నొక్కి ఒక సారి వినండి



మామ అల్లుళ్ళ సవాల్



ఒక ప్రేమికుడు తన ప్రేయసి తండ్రి దగ్గరకు వెళ్లి , అతని
  కూతురిని తన కిచ్చి పెళ్లి చేయమని అడిగాడు .


దానికి ఆ తండ్రి తన కూతురు జీవితాంతము ఒక గాడిద తో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదు అని అన్నాడు .


దానికి ఆ అబ్బాయి అందుకే గదా నాకిచ్చి పెండ్లి
చేయమంటున్నాను  

Tuesday, 21 May 2013

దేవుడా నా కెందుకు ఇలాంటి ద్వి మనసును ఇచ్చావు ?



ఉరిని అసహ్యించుకునే నేను అజ్మల్ కసాబ్ ,అఫ్జల్ గురు ను ఉరి తీస్తే సంతోషించా ఎందుకు ?




పాకిస్తాన్ లో సరబ్జిత్ సింగ్ ను చెరసాలలో కొట్టి చంపేస్తే ఎంత ఘోరం అని ఆక్రోశించిన నేను

కాశ్మీర్ చెరసాలలో సనా ఉల్లహ్ ను కొట్టి చంపిన వినోద్ కుమార్ ని అభిమానించడం ఏమిటి?




నేను ఒకటే తప్పుకు రెండు రకాలుగా ఎందుకు స్పందిస్తున్నాను ?

Thursday, 16 May 2013

అబద్దాలను కనిపెట్టే రోబో





ఒక అందమైన ఊరిలో ఒక ఆనందమైన దంపతులు , వారికి ఒక అపురూపమైన కుమారుడు . వాడికి అబద్దాలాడే దుర్గుణం . వాడికి ఆ అలవాటు మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసారు , అన్నీ వ్యర్ధం అయినాయి .


 చివరకు ఒక శాస్త్రవేత్తను కలిసి అబద్దాలను కనిపెట్టే రోబో ని కొనుకొచ్చారు . ఆ రోబో సమక్షం లో ఎవరైనా అబద్దము ఆడితే వెంటనే వాళ్ళ చెంప మీద కొడుతుంది .

 ఆ రోజు ఆ కుమారుడు సినిమా కు వెళ్ళి , రాత్రి బాగా ఆలస్యం గా ఇంటికి వచ్చాడు . 

 తల్లితండ్రులు వాడిని ఆ రోబో దగ్గరికి తెచ్చి ,ఎందుకు ఆలస్యం అయింది ? అని అడిగారు .
 
స్పెషల్ క్లాసు అని అన్నాడు . వెంటనే రోబో వాడి దగ్గరకు వచ్చి చెంప మీద చెళ్ళు మని కొట్టింది  



తండ్రి వాడితో కోపంగా అబద్దాలాడ తావా ? నీ వయసంతప్పుడు నాకు అసలు అబద్దాలంటేనే తెలియదు అన్నాడు .
 
వెంటనే రోబో తండ్రి దగ్గరకు వెళ్లి చెంపమీద గట్టిగా కొట్టింది . 



ఇది చూసి భార్య ఛీ నీవే పెద్ద అబద్దాల పుట్టవు , వీడు నీ కొడుకేగా అన్నది . 

ఈ సారీ రోబో భార్య దవడ పగలకొట్టింది .



Pictures Courtesy - Google




Wednesday, 15 May 2013

చట్టబద్దమైన హెచ్చరిక

చట్టబద్దమైన హెచ్చరిక

ఆంధ్ర రాష్ట్రం లో ఎలక్షన్ లు దగ్గరపడుతున్నప్పటినుండి ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడినది . తెలంగాణా ప్రాంతంలో తెరాస లోకి అన్ని పార్టీల నుండి దూకుతున్నారు . వీళ్ళు నిజంగా తెలంగాణా ఋణం తీర్చుకుంటా నికేనా? లేక ఎన్నికలలో పోటిచేయ్య డానికా ? కోస్తాలో వై . ఎస్ . అర్. సిపి లోకి వస్తున్నారు. అంటే అవినీతిని సమర్ధిస్తున్నారా? లేక రాజకీయ లబ్ధి కోసమా? ఈ నాయకులు పార్టీలు మారిన తర్వాత మాట్లాడే మాటలు రోతను పుట్టిస్తున్నాయి . తాజాగా ఈ రోజే పార్టీ మారిన నాయకుడు " పార్టీలు మారడం రాజకీయ వ్యభిచారము కాదు " అని అంటున్నాడు . నిజమే వ్యభిచారము చేసే వాళ్ళు అవసరార్ధం చేస్తున్నారు , పతివ్రతల్లాగా నటించడం లేదు . 

ఎలక్షన్ ల అప్పుడు కూడా అంతే కాబట్టి  ఎలక్షన్ లో ఓటు వేయడం ఎంత ముఖ్యమో సరిఅయిన వ్యక్తిని ఎన్నుకోవడం అంతే ముఖ్యము .

(cartoon courtesy : Google)

Monday, 13 May 2013

నేటి రాజకీయాలు ఒక పాత జోక్

ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు , అలా ఉమ్ము ఊస్తూ మాట్లాడకు మనము రాజకీయాలు 

మాట్లాడుతున్నాము అని చూసే వాళ్ళు అనుకుంటారు . కాని ఇప్పుడు రాజకీయాలు గురించి మాట్లాడాలంటే 

గాండ్రించి ఉమ్మాల్సి వస్తుంది .

Sunday, 12 May 2013

మా తుజె సలాం

అమ్మలందరికి  శుభాకాంక్షలు . మదర్స్ డే సందర్భముగా తల్లి ప్రేమను చూపే ఒక చిత్రం 



Sunday, 28 April 2013

ఈ రేపిస్ట్ లను క్షమించాలి అంతే !!!

ఈ రేపిస్ట్ లను క్షమించాలి అంతే !!!
మొన్న జరిగిన ఢిల్లీ  అత్యాచారము చాలా ఘోరమైనది . కేవలం మానభంగము చేయడమే కాదు లైంగిక అవయములలో క్రూరముగా వస్తువులతో గాయ పరచడము చూస్తూ వుంటే దీనిని వర్ణించడానికి ఇప్పుడు ఉన్న మాటలు చాలవు క్రొత్త పదాలను కనిపెట్టాలి . ఇహ నిన్న జరిగిన పసిపాప సంఘటన చూస్తుంటే భయంతో వణికి పొయ్యాము. వారికి కూడా క్షమాపణ కావాలి . కాని మానవులుగా మనము వారిని క్షమించలేము , కాని దేవుడు క్షమిస్తాడు . కాబట్టి వాళ్ళను వెంటనే దేవుడు దగ్గరకు పంపిద్దాము .

 దానికి నువ్వు కర్రలకర్రలనే  ఉపయోగిస్తావో ,ను ఉపయోగిస్తావో , 




రాళ్ళను ఉపయోగిస్తావో ,



ఉరినే ఉపయోగిస్తావో 

నీ ఇష్టం .


 కాని వారికి తక్షణమే క్షమాపణ కావాలి కాబట్టి ఆలస్యం 

చేయకు .