Friday, 23 November 2012
Tuesday, 2 October 2012
ఓ బాపు ఫీల్ మై లవ్
ఇద్దరు మహానుభావులు
ఈ రోజు ఇద్దరు మహానుభావుల పుట్టిన రోజు . ఒకరు ఎవరు గుర్తుంచుకొని ఎవరు పట్టించుకోని లాల్ బహుదూర్ శాస్త్రి (శ్రీ కప్పగంతు శివరామ ప్రసాద్ గారు జ్ఞాపకము చేసుకున్నారు). నిజానికి అదే ఆయనకు మనము అర్పించే నివాళి . కాబట్టి ఈయన అదృష్టవంతుడే .
రెండవ వ్యక్తి అందరు గుర్తుంచుకునే అందరు పట్టించుకునే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ. అదే ఆ కరం చంద్ యొక్క ఖర్మ. అసలు ఇది నేను ఎందుకు రాస్తున్నానంటే నిన్న జరిగిన సంగతి తెలియాలి.
రేపు గాంధీ జయంతి మాంసపు కొట్లు ఉండవు కాబట్టి ఈ రోజే వెళ్లి తీసుకురమ్మని నా భార్య అంది. రోజు రాత్రి తొమ్మిది గంటల దాకా తెరచి ఉండే కొట్లు నిన్న ఆరున్నర ఏడు లోపలే మూసేశారు. ఒకటి రెండు కొట్లు తెరిచి ఉన్నా అవి మాంసము అమ్మివేసి శుభ్రం చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే రేపు గాంధీ జయంతి కాబట్టి మాంసపు కొట్లు ఉండవు . కాని రేపు శలవు దానిని ఆనందముగా జరుపుకోవాలంటే మాంసము కావాలి. కాబట్టి రేపటి పని నేడే చెయ్యాలి అనే సూత్రం సరిగ్గా అమలు చేయబడినది. కాబట్టి మద్యానికి కూడా ఈ సూత్రము అమలు చేయబడి ఉంటుందనుటలో సందేహమేలా! గాంధీ మీద గౌరవముతో ప్రభుత్వము ఈ నిషేదము చేసినది, కాని చిత్త శుద్ధి లేని శివ పూజ లేల అనే చందంగా మారినది.నిజముగా ఈ దినము ఎంత మంది భారతీయులు ఈ నియమమును శ్రద్దగా పాటిస్తున్నారు? ముఖ్యముగా రాజకీయ నాయకులలో ఎంతమందికి చిత్తశుద్ది ఉన్నది, మరి ముఖ్యముగా గాంధీ మా పార్టీ వాడే అనే కాంగ్రెస్ వారిలో ఎంత మంది నాయకులు , ప్రజా ప్రతినిధులు మరియు మంత్రులు ఈ రోజు మధ్య మాంసములను ముట్టుకోకుండా ఉంటారు? అలాంటప్పుడు ఇలాంటి ఆజ్ఞలు ఇవ్వడము ఎంత వరకు సమంజసము? పాపము వామ పక్ష నారాయణ ఒక్కడే అని అనుకుంటారు ఆయన దొరికిపోయి ఒప్పుకున్నాడు వీళ్ళు ఒప్పుకోరు. అంటే తేడా!
నేను దీనికి వ్యతిరేకిని కాదు , కాని ఈ ఒక్కరోజు నిషేధం నిబద్దతతో పాటించే లాగ ప్రజలను పురిగొల్పుటలో ప్రభుత్వానికి అసలు శ్రద్ధ లేనేలేదు. కొద్ది మంది గాంధీ నిజమైన అభిమానులు మాత్రమే చిత్త శుద్ధి తో పాటిస్తారు, మరి కొద్ది మంది అంతరాత్మకు భయపడి మానేసి ఉంటారు. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? వారి శాతం ఎంత? ఒక్క సారి ఆలోచించండి?
నీతులు చాలా బాగున్నాయి , మరి నీ సంగతి ఏమిటి ? నిన్న నువ్వు ఎందుకు వెళ్లావు? నీకు దొరకలేదనే అక్కసు తోటేగా ఈ సోది అంటారా? నేను వెళ్ళింది మా కోసం కాదు మా క్వీని కోసము . పెంపుడు కుక్కలకు స్వతంత్రం ఉండదు , స్వాతంత్రం లేని వాటికి గాంధీ విలువ ఏమి తెలుసు? శేఖర్ కమ్ముల గోదావరి చిత్రంలో ఊర కుక్క " ఒరేయ్ నల్లోడా నువ్వు జాతి కుక్కవే గాని మా ఊర కుక్కల్లా నీకు స్వతంత్రం లేదురా " అని అంటుంది . అయినా స్వతంత్రం విలువ గాంధీ విలువ తెలియని అది కూడా ఈ రోజు పెడిగ్రీ బిస్కట్లు తిన్నది.
కాని ఒక్కటి మాత్రమూ నిజము, భారతీయుల హృదయాలలో గాంధీ అంటే జాతిపిత బాపూజీ నిరంతరమూ ఉంటారు. ఎక్కువ మంది ప్రేమతోటి అభిమానము తోటి ఆయనను హృదయములో ఉంచుకుంటే, కొద్దిమంది స్వార్ధముతో (రాజకీయ) ఆయనను హృదయములో ఉంచుకున్నారు. మరి కొద్ది మంది ద్వేషం తోటి ఆయనను తమ హృదయములో ఉంచుకున్నారు.
ప్రేమ తో అభిమానముతో ఉన్నవారు ఈ రోజు గాంధీ గురించి కొన్ని మంచి ఆలోచనలను చేసి కనీసం ఇప్పటి నుండి అయినా ఆయన ఆశయాలను పాటిద్దామని అనుకుంటారు. స్వార్ధముతో ఉన్నవారు ఉపన్యాసాలు దంచుతారు. ద్వేషం తో ఉన్న వారు విషాన్ని చిమ్ముతారు.
ప్రేమ చేత అయితే ఏమి, మిష చేత అయితే ఏమి ,క క్ష చేత అయితే ఏమి ఓ బాపు నీవు నిరంతరం మా హృదయాలలో ఉన్నావు. కాబట్టి మా ఆధునిక లవ్ గురు ఆర్య చెప్పినట్లు ఫీల్ మై లవ్ .
Thursday, 13 September 2012
నిశ్చితార్ధం తర్వాత
నిశ్చితార్ధం తర్వాత
ఆమె : దీని కోసం ఎంత కాలం ఎదురు చూసానో.
అతడు : నేను నిన్ను వదిలి వెళ్లాలని కోరుతున్నావా?
ఆమె: లేదు లేదు
అతడు: నీవు నన్ను ప్రేమిస్తున్నావా?
ఆమె: అవును
అతడు: నువ్వు నన్ను మోసం చేస్తావా?
ఆమె: దాని కంటే నేను చావడం మేలు
అతడు: నన్ను ముద్దు పెట్టుకొవా?
ఆమె: తప్పకుండా . అది నాకు ఎంతో సంతోషం
అతడు: నువ్వు నన్ను బాధ పెడతావా?
ఆమె: నేను అలాంటి దానిని కాదు
అతడు: నిన్ను నమ్మ వచ్చా?
ఆమె: ఆ
అతడు: ఓ ప్రియా
పెళ్లి అయిన తర్వాత ఏమైందో ఒక్క సారి తిరగేసి చదువుకోండి
(ఎక్కడో చదివిన ఇంగ్లీష్ జోక్ కి తెలుగు అనువాదము)
Friday, 29 June 2012
బతకలేక బడి పంతులు
స్కూల్ లు మరల తెరిచారు , మొన్న హైదరాబాద్ లో , ఈ రోజు కలకత్తా లో టీచర్ ల పైశాచికత్వం బయట పడింది. వీళ్ళ ముందు సినిమా విలన్లు , యమ భటులు బలాదూర్. అమ్మ గార్ల అకృత్యాలు అయ్య గార్ల అఘాయిత్యాలు చూస్తుంటే పిల్లలను ముఖ్యముగా ఆడపిల్లలను చదువు మానిపించడము అంత శ్రేష్ట మైన పని మరొకటి లేదనిపిస్తుంది ( స్త్రీలు నన్ను క్షమించుగాక ).
గురువుని బ్రహ్మ గా పూజించే దేశంలో ఈ గురువులను ఏమి చేయాలి? ఇది నిజంగా ప్రతి ఇంటిలో ఉన్న సమస్యే , కాబట్టి దీని గురించి మనము తీవ్రంగా ఆలోచించాలి.
ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనే వారు, ఇప్పుడు బ్రతకనివ్వని వాడు బడిపంతులు అన్నట్లు ఉన్నది. దీనికి పరిష్కారం ఏమిటి?
Wednesday, 23 May 2012
పినాకి లారా ఆలోచించండి
తెలిసినట్లుగానే మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగాయి.
పెట్రోల్ బంకుల ముందు క్యూలు పెరిగాయి.
పనిలో పనిగా ట్రాఫిక్ జాములు గూడా పెరిగాయి.
ఇది ఈ సాయంత్రం వీధులలో పరిస్థితి. ఇది అంతా మనకు అవసరమా?
ఒక్క సారి ఆలోచించండి. మనము వృధాగా ఎంత పెట్రోల్ వేస్టు చేస్తున్నాము, ఇలా పెరిగినప్పుడు ఆ క్యూలలో గంటలకొద్దీ పోరాడి నాలుగు లీటర్ల పెట్రోల్ పోయించుకుని ఏమి సాధిస్తున్నాము. నిజంగా అత్యవసరము ఉండి తొందరగా వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది ఎంత ఇబ్బంది.
1) ఒక మోటారు సైకిలు యజమాని ఎంత పెట్రోల్ కొట్టించు కుంటాడు, మహా అయితే ఐదు లీటర్లు 5 X 7 = 35 రూపాయలు. ఆ తర్వాత కొత్త రేటుకే కొనాలిగదా.
2) ఒక కారు యజమాని ఎంత కొంటాడు , ఇరవై లీటర్లు , అంటే 140 రూపాయలు.
ఇది ఒక ప్రాణం కంటే విలువైనదా? ఒక కుటుంబ సమస్య కంటే గొప్పదా? ఒక ఉద్యోగి కష్టము కంటే పెద్దదా? ఎవరికీ ఏ సమస్య ఉండి ఈ క్యూల వలన వేదన పడుతున్నారో ఆలోచించండి. మనం వ్యక్తిగతముగా ఎంత సమయాన్ని కోల్పోతున్నాము, ఆ రద్దీలో వాహనాలకు నష్టము కలగడము లేదా?
అసలే మనకున్న నెత్తినొప్పులు మనకున్నాయి, తరచుగా వచ్చే ఈ తల నొప్పి కూడా ఎందుకు?
రోట్లో తల పెట్టి రోకలి పోట్లకు వెరుస్తామా?
అలాగే వాహనము కొని పెరిగే పెట్రోల్ రేట్లకు భయపడతామా? బాధే సౌక్యమనే భావన రానీవోయి ఆ ఎరుకే నిత్యానందము బ్రహ్మ్హనందము
ఈ ఆడవాళ్ళను అర్ధం చేసుకోవడము చాలా కష్టం
ఈ ఆడవాళ్ళను అర్ధం చేసుకోవడము చాలా కష్టం
నేను నా స్నేహితుడు ఒక రోజు తెల్లవారు జామున ఇంటికి వెళుతున్నాము.
నేను అన్నాను " నేను ఇలా ఆలశ్యముగా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను , కారు ఇంజను ముందుగానే ఆపివేస్తాను, నెమ్మదిగా తలుపులు తీస్తాను , బూట్లు తీసి ముని కాళ్ళ పై నడుచుకుంటూ వెళ్ళి మంచం పై శబ్థం చెయ్యకుండా పడుకుంటాను . అయినా నా భార్య వెంటనే లేచిపోతుంది " అని అన్నాను.
దానికి నా స్నేహితుడు " నేను అయితేనా పెద్ద గొడవ చేసుకుంటూ వెళ్ళతాను" అన్నాడు.
నిజంగానా అని నేను ఆశ్చర్యంగా చూసాను.
వాడు అన్నాడు " కారు హారను పెద్దగా కొడతాను , తలుపులను థడేల్ అని పెద్ద శబ్ధం తో తెరుస్తాను,బూట్ల కాళ్ళను నేలకు గట్టిగా కొడుతూ బెడ్ రూం లోకి వెళ్ళి మంచం మీదికి ఎగిరి దూకి పడుకుంటాను " .
ఎప్పటి లాగానే నిద్ర నటిస్తుంది అని జవాబిచ్చాడు.
Wednesday, 21 March 2012
నా నిజాయితీని మా నాన్న గారు మెచ్చు కున్న విషయం వినండి.
నిజాయితీ
నా నిజాయితీని మా నాన్న గారు మెచ్చు కున్న విషయం వినండి.
అవి నేను హై స్కూల్ లో చదువుతున్న రోజులు , నా ప్రోగ్రెస్ కార్డ్ లోని మార్కులు చూసి మా నాన్న గారు " నీకు వచ్చిన మార్కులు చూస్తుంటే నాకు ఒక విషయం అర్ధ మౌతుంది, ఇంత దారిద్ర మైన మార్కులు వచ్చాయంటే నువ్వు తప్పకుండా కాపీ మాత్రం కొట్టడం లేదు" అని అన్నారు.
Friday, 16 March 2012
నేను గొప్ప గాయకుడిని అని మీకు తెలుసా?
నిజానికి నా మొదటి కచేరి ఇచ్చే వరకు నాకు తెలియదు.
నా అభిమానుల హడావిడి ,వారు నాకు చేసిన సన్మానము చూసి ప్రఖ్యాత గాయకులు శ్రీ బాల మురళి కృష్ణ గారు, శ్రీ జేసుదాస్ గారు మరియు శ్రీ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు ఆశ్చర్యపొయ్యారు.
అసలు జరిగిన సంగతి ఏమిటంటే ఒక కచేరిలో వారు ముగ్గురు రెండు రెండు పాటల చొప్పున పాడారు,
తర్వాత నేను ఒక పాట పాడి రెండవ పాట పాడబోతుంటే, నా అభిమానులు స్టేజి మీదకు దూసుకొచ్చారు.
నాకు దండలు వేసి , శాలువా కప్పారు.
ఒక అభిమాని మైక్ లాక్కొని మాట్లాడడము మొదలు పెట్టాడు, " మా మట్టుకు మాకు మీరే గొప్ప గాయకులు , మీ లాంటి గాయకులే ఇప్పుడు ఎంతో అవసరము . ఇంత అద్భుతమైన గాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు. నిజానికి మేమందరమూ ఇక్కడ బజ్జీలు, పల్లీలు, టీలు . సోడాలు అమ్ముకునే వాళ్లము. ఇంతకూ ముందు వాళ్ళు పాడినప్పుడు మేము ఒక్కటి కూడా అమ్మలేక పోయ్యాము, కాని మీరు పాడటము మొదలు పెట్టగానే ఒక్కటి గూడా మిగలకుండా అన్ని అమ్మేసుకున్నాము ........
కల చెదిరింది కథ మారింది
కన్నీరే ఇక మిగిలింది ... కన్నీరే ఇక మిగిలింది
Friday, 17 February 2012
మీరు ఏ రకము?
ఈ లోకములో నాలుగు రకముల ప్రజలు ఉన్నారు. లోకములో ఉన్న జనులందరూ కూడా వీటిలో ఏదో ఒక తరగతికి చెంది ఉంటారు. వారు ఏ దేశస్తులు అయినా , ఏ జాతి అయినా, ఏ మతం అయినా లేక ఏ కులం అయినా.
వీటిలో మీరు ఏ తరగతికి చెందినవారో మీరే పరీక్షించుకోండి.
1) సాంప్రదాయ వాదులు (Reactionary)- ఓల్డ్ ఈస్ గోల్డ్ , పాతది అంతా మంచిది. పూర్వా కాలంలో ఎంతో బాగుండేది. అప్పుడు కాలుష్యం లేదు, ఒత్తిడి లేదు, ఇన్ని రకాల జబ్బులు లేవు, మనుష్యుల మధ్య ఆప్యాయతలు , అనురాగము ఉండెడిది. పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా యెంతో సందడి ఉండేది. ఆ రోజులే బాగుండేవి అని అంటుంటారు.
2) సనాతన వాదులు (Conservatives) - పాతది మంచిదే కాని... పూర్వా కాలం అన్ని బాగుండేవి , కాబట్టి వాటి మీద ఆధారపడి మరింత మంచివాటిని నిర్మించుకుందాము.
3) అభ్యుదయ వాదులు ( Progressive) - పాతది రోత . పూర్వం ఏమి బాగుంది . కరెంట్ లేదు , ఫోన్ లేదు, సౌకర్యాలు లేవు. ఆ కాలంలో కాశీ కి వెళ్ళడమంటే కాటికి వెళ్ళడమే . ఇప్పుడు రైలు ఎక్కితే ఒక రోజు, విమానం ఎక్కితే అదే రోజు వెళ్ళవచ్చు. అప్పటి సాంఘిక పరిస్తితులు కూడా అంతబాగుండేవి కావు అనేక రకాల వైషమ్యాలు అణచివేతలు ఉండేవి. కాబట్టి పూర్వాకాలం ఏమి బాగాలేదు, ఇప్పుడే చాలా బాగుంది.
4) విప్లవ వాదులు (Radical) - పాతది రోత, కొత్తది రొచ్చు. వీళ్ళకు పూర్వాకాలము బాగాలేదు, ఇప్పుడు కూడా బాగాలేదు. కాబట్టి ఒక క్రొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాము, నవ సమాజాన్ని సృష్టిద్దాము. పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి.
Wednesday, 15 February 2012
Monday, 13 February 2012
ఇల్లాలి ముచ్చట్లు
మొదటి జంటలో ఉన్న భర్త తో ," నువ్వు పక్క త్రాగుబోతువి , ఎప్పుడు త్రాగుడు త్రాగుడు త్రాగుడు , ఇంకా విశేషం ఏంటంటే నీ భార్య పేరు రమా అయితే నువ్వు "రమ్ము" అని పిలుస్తావు. నీలాంటి వాడికి ఇక్కడ స్థానంలేదు" అని వెళ్ళగొట్టాడు.
రెండవ వ్యక్తి తోటి , " నువ్వు పేకాట పిచ్చి గాడివి నీకు ఎప్పుడు పేకాట పేకాట పేకాట , చివరికి నీ భార్య పేరు జానకి అయితే నువ్వు "జాకీ " అని పిలుస్తావు. నిన్ను లోపలి రానిస్తే దీనిని నువ్వు జూద గృహముగా మారుస్తావు. కాబట్టి నీకు ప్రవేశం లేదు." అన్నాడు.
మూడవ జంట లోని భర్తతో " నీకు రేసులంటే ప్రాణం , రేసులాడకుండా నువ్వు బ్రతకలేవు, నీకు ఎప్పుడు రేసులు రేసులు రేసులు, చివరికి అశ్వని అనే పేరు ఉన్న అమ్మాయిని వెదికి పెండ్లి చేసుకున్నావు. నీ భార్య ను "అశ్వం" అని పిలుస్తావు. నిన్ను అసలు లోపలి రానియ్యను" అన్నాడు.
నాలుగవ జంటలోని వ్యక్తి తన భార్య కామాక్షి తో "కాముడు" మనల్ని ఎలాగూ లోపలి రానియ్యాడు కానీ పద వెళ్లి పోదాము అన్నాడు.
Wednesday, 1 February 2012
వారసులు ఉన్నారు జాగ్రత్త
వారసులు ఉన్నారు జాగ్రత్త
"జాగ్రత్త " అని మీరు సరిగ్గానే చదివారు , వీళ్ళల్లో కొంత మందిని చూస్తే ముఖ్యముగా హీరోల వారసులు వెండి తెరపైకి వస్తే అప్పుడు అర్ధ మౌతుంది నా హెచ్చరిక.
వీరిలో సునీల్ ఆనంద్ ఆనంద్ ఔర్ ఆనంద్ ద్వారా హీరో గా పరిచయము అయ్యాడు . ఇప్పుడు కాదండి బాబు నా చిన్నప్పుడు అంటే డెబ్బయ్యో శతకములో .
బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ రణబీర్ కపూర్ లాగా ఉన్నాడు.
హిందీ సినీ ప్రముఖుల వారసులు
జీనత్ అమన్ కుమారుడు అజాన్
బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్
రంజిత్ కుమారుడు చిరంజీవ్
అనిల్ కపూర్ కుమారుడు హర్హవర్ధన్ కపూర్
శత్రుఘ్న సిన్హా కవల కుమారులు లవ్ కుష్
నానా పటేకర్ కుమారుడు మల్హార్
మిథున్ చక్రవర్తి కుమారుడు మొమో
ఆదిత్య పంచోలి మరియు జరీన వాహబ్ ల కుమార్తె సనా పంచోలి
మహేష్ భట్ట్ కుమార్తె షహీనా భట్ట్
శక్తి కపూర్ కుమారుడు సిద్దాంత్ కపూర్
దేవ్ ఆనంద్ కుమారుడు సునిల్ ఆనంద్
జాకీ శ్రోఫ్ఫ్ కుమారుడు టైగర్ శ్రోఫ్ఫ్
నసీరుద్దీన్ షా కుమారుడు వివాన్ షా
Tuesday, 31 January 2012
Christian preacher attacked in Jaipur
Special Correspondent
Masked intruders go on rampage in house in the vicinity of Chief Minister's official residence |
� Photo: PTI

BEFORE AND AFTER: Getting ready for the attack on preacher Walter Massey are some men who are covering their faces.
BEFORE AND AFTER: Getting ready for the attack on preacher Walter Massey are some men who are covering their faces.
JAIPUR: Masked youth attacked and seriously injured a Christian preacher and went on the rampage in his house in the neighbourhood of the official residence of the Rajasthan Chief Minister here on Sunday afternoon. Walter Massey has been admitted to the emergency ward of the Sawai Man Singh Medical College Hospital here. Authorities there termed his condition stable. No arrest has been made so far.
Mr. Massey runs a small congregation, `Masihi Sanghti,' from his middleclass residence at Nandpuri Bazar. The intruders, numbering 15-20, used sticks and whatever came in handy to attack Mr. Masseyin the presence of his wife and child.
His wife Joyce told this correspondent that initially three persons came seeking to meet her husband. When the door was opened, they engaged the preacher in a conversation and in no time started assaulting him. And more men, covering their faces, joined in the attack.
As the attackers dragged a profusely bleeding Massey out of the house, a neighbour Samuel Roberts, who was passing by, rushed to the Sodala police station, half km away.
Ms. Joyce and the child were not hurt though the intruders broke plastic chairs, utensils and furniture.
� Photo: PTI

The image of the bleeding missionary.
The image of the bleeding missionary.
Mr. Roberts said there were around 25 men, who covered their faces and were wielding sticks, outside Mr. Massey's residence.
Assailants on video
Additional Superintendent of Police (South) Subhash Vishnoi said the police were trying to identify the persons spotted on a video on the incident telecast by some TV channels. A case has been registered.
The Congress, the Communist Party of India (Marxist) and the Jamaat-e-Islami Hind condemned the attack.
Congress general secretary Ashok Gehlot termed it a "very serious matter" and demanded the immediate arrest of the culprits.
"Vishwa Hindu Parishad workers have once again taken law into their own hands in the name of stopping religious conversions in the State and this is condemnable." CPI (M) State secretary Vasudev said, "The Chief Minister and the Home Minister should take the responsibility for the attack," which occurred in the Civil Lines locality."Hardly four days ago did workers of the BJP-affiliated Akhil Bharatiya Vidyarti Parishad attempt to attack the CPI (M) State headquarters on Hatwara Road , he alleged.
Engineer Mohammed Saleem, new president of the State Jamaat-e-Islami Hind, said the attack put a question mark on the very existence of a government in the State.
Subscribe to:
Posts (Atom)







.jpg)



.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)




























