Wednesday, 4 September 2013
Wednesday, 12 June 2013
ముస్లిం ల సమస్య వలన అభి వృద్ది చెందిన హిందూ స్టేట్
స్టేట్ జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ప్రదేశము , అక్కడి టెర్రరిస్ట్ ల సమస్య వలన పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ కి రావడం మొదలు పెట్టారు . ముఖ్యముగా గత పది పదిహేను సంవత్సరముల నుండి యాత్రికులు మనాలి కులు ప్రాంతాలకు వస్తున్నారు . సినిమా షూటింగ్ లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.
హిమాచల్ లో హిందువుల జనాభా అధికము. ఇంకా చెప్పాలంటే హిందువుల తర్వాతి స్థానము భౌద్ధవులది .
Tuesday, 11 June 2013
ఇది శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కుమార్తె ఇల్లు
నిజమే ఇది నిజంగా వాజ్ పేయి కుమార్తె ఇల్లే . పెళ్లి కాని వాజ్ పేయికి కుమార్తె ఎక్కడ నుండి వచ్చింది అని అనుకుంటున్నారా ?
ఏమి సందేహము వద్దు ఆయన నికార్సు అయిన బ్రహ్మచారే
Monday, 3 June 2013
ఆ ఆలోచనకే చేతులెత్తి నమస్కరిస్తున్నాను
"ఈ రోజు ఈనాడు లోని ఒక వార్త ఎక్కువ మంది అమ్మాయిలు ప్రేమ పేరుతో ఇంట్లో నుండి పారిపోతున్నారు"
విదేశాలలో ముఖ్యముగా పాశ్చాత్య దేశాలలో పెళ్ళికి ముందు కలిసి తిరగడం అనే సంస్కృతి ఉన్నది. దీనిని పెళ్ళికి ముందు ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడానికి అనే ముసుగులో వారి లైంగిక విశౄంఖలత్వమును ప్రదర్శిస్తున్నారు . వారిలో ఎంత మంది వివాహము చేసుకుంటున్నారు ,ఒక వేళ పెళ్లి చేసుకున్నా , అలా అర్ధం చేసుకుని చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని నిలుస్తున్నాయి?
అయినా వారికి అర్ధం కానిది ఆశ్ఛర్యం కలిగించేది మన వివాహ పద్దతి . మన దేశంలో పెళ్ళికి ముందు పెద్ద పరిచయము లేకుండా , ఒకరిని ఒకరు అర్ధం చేసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది వారికి అనాగరికము లాగా కనిపిస్తుంది . అంతే గాని మన వివాహాల విజయ శాతమును వాళ్ళు గుర్తించడము లేదు . వాటి వెనుక ఉన్న మూల సూత్రాలను గుర్తించడము లేదు . భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ జీవితాంతము కలిసి ఉండాలనే ఆ ఆ ఆలోచనకే చేతులెత్తి నమస్కరిస్తున్నాను
ఈ నాడు మనలో కూడా విడాకుల సంఖ్య పెరిగి పోతున్నదంటే కొంత వరకు పాశ్చాత్య సంస్కృతి ప్రభావము ఉన్నది . ఈ ప్రభావము కేవలం పిల్లలలోనే కాదు తల్లితండ్రుల మీద కూడా ఉన్నది . తల్లితండ్రులు గత తరం వారిలాగా కాక నాగరికత పేరుతొ స్వేచ్ఛ నిస్తున్నారు . ( నేటి సినిమా లలోను, వ్యాపార ప్రకటన లలోను ఈ ధోరణి బాగా కనపడుతున్నది . కొత్తగా వస్తున్న పారగాన్ చెప్పుల ప్రకటనలో కొడుకు తన స్నేహితురాలితో సినిమాకి వెళ్ళడానికి తండ్రిని చెప్పులు అడగడం )
Saturday, 1 June 2013
Tuesday, 28 May 2013
Haunting Song
వెంబడించే పాట
ఒక పాత కథ గద్దర్ గారి పాట గురించి చదివాను. గద్దర్ గారి పేరు వెయ్యలేదు గాని , ఒక పెళ్లి బృందం బస్సు లో పెళ్ళికి వెళుతూ పాటలు పెట్టు కుంటారు ,అందరూ సరదాగా మాట్లాడు కుంటూ వెళ్తుంటారు. హఠాత్తుగా విప్లవ పాట వేసేసరికి అందరూ మౌనం అయిపోతారు . ఆ సాహిత్యం , స్వరము వాళ్ళను ఒక మైకం లోకి తీసుకువెలుతుంది .
ఆ కథలో లాగే నాకు ఈ పాట
నేను చదువుకునే రోజులలో ఒక సాయంత్రం ఎక్కడో దూరంగా మైకు లోంచి ఈపాటను విన్నాను. ఇది జాతర (1978)సినిమా లోనిది, ఎస్. పి. శైలజ గారు పాడారు . ఆ భావమును నేను వర్ణించలేను కాని ఒక అనిర్వచనీయ మైన అనుభూతి కలుగుతుంది . మనసంతా ఏదోలా అయిపోతుంది . గుండెలను పిండే భావన . నిజముగా అది ఏమిటో నాకే తెలియదు. పాట వినాలని మనసు ఉవ్విళ్ళు ఊరుతుంది ,కాని వింటే తట్టుకోలేను . ఇది నాకు ఇష్ట మైన పాట మాత్రము కాదు , అలా అని ఇష్టం లేదు అని చెప్పలేను . కాని చాలా బాగుంటుంది .
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9001
ఇక్కడ నొక్కి ఒక సారి వినండి

Subscribe to:
Posts (Atom)
.jpg)

.jpg)