Friday, 4 November 2011

ఒక ఆడది హోం మంత్రిగా ఉన్న రాష్ట్రం లో వాళ్లకు ఉంగా ఉంగా బాష నేర్పాలి

                                                                        శ్రీమతి సబితా ఇంద్ర రెడ్డి 





అదొక కో ఎడ్యుకేషన్ కాలేజ్ , త్రిపుర సుందరి ( ఊరు పేరు వ్రాయక్కరలేదు త్రిపుర  అంటే వరంగల్ , హన్మకొండ , కాజిపేట్ ) దగ్గరకు అనిల్ కపూర్ (తేజాబ్ హీరో తేజాబ్ అంటే ఆసిడ్ ) వచ్చాడు. వాడిని చూడగానే త్రిపుర మనసులో వీడు పగలు చూస్తే రాత్రికి కలలో వస్తాడు రాత్రి చూస్తే పగలు వాంతికి వస్తాడు అని అనుకుంది. వాడు నువ్వు నన్ను ప్రేమిస్తావా ? లేదా? అని సుత్తి లేకుండా నత్తిగా అన్నాడు . నువ్వు పగలు చూస్తే రాత్రికి కలలోకి వస్తావు అని అంది . వెంటనే వాడు ఆ రాత్రికి కలలోకి వస్తున్నానా అని  మెలికలు తిరిగాడు . ఖర్మ నువ్వు అలా అర్ధం చేసుకున్నవా? అని నేను ప్రేమించను, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో అంది . వెంటనే వాడు ఆసిడ్ తీసాడు, త్రిపుర సుందరి ఏ మాత్రం భయపడకుండా వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ " ఒక ఆడది హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో నువ్వు ఆడవాళ్ళ మీద ఆసిడ్ పోస్తావా?" అంది. వెంటనే వాడు ఆ బాటిల్ పడేసి "అమ్మా ఒక స్త్రీ గృహ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆడదాని మీద ఆసిడ్ పోసే దుర్మార్గుడిని కాను , ఏదో జనరల్ నాలెడ్జి తక్కువై వచ్చాను క్షమించు" అన్నాడు.

ఒక పార్కులో "గోపి నేను ఇప్పుడు గర్భవతిని, మనం వెంటనే పెండ్లి చేసుకుందాము "అని రాధ అన్నది, దానికి గోపి "హేంత పని చేసావు రాద్ధా, నేను నా భార్య గురించి ఎన్ని కలలు కన్నాను , నా కాబోయే భార్య ధనవతి కాకపోయినా పర్వాలేదు , గుణవతి కాకపోయినా పర్వాలేదు కాని గర్భవతి మాత్రం కాకూడదని అనుకున్నాను , ఇప్పుడు నిన్ను ఎలా పెళ్లి చేసుకోను "   అన్నాడు . " ఏంటీ  ఒక స్త్రీ గృహ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో నువ్వు మరొక స్త్రీని మోసం చేస్తావా?" అన్నది , "అరె ఆ విషయమే నేను మర్చిపొయ్యాను" అని పళ్ళు కొరుకుతూ పెళ్ళికి సిద్దమయ్యాడు గోపి.
  
ఒక ఇంట్లో భార్యను కట్నం కొరకు వేధిస్తున్న భర్త హోం మినిస్టర్ ఆడది అని గుర్తు చేయగానే భార్య కాళ్ళ మీద పడ్డాడు.

 ఈ విధంగా ఒక స్త్రీ హోం మంత్రిగా ఉండడము వలన మన రాష్ట్రములో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు తగ్గిపోయినాయి.

 కాని వైజాగ్ లో నలుగురు కామందులు ఒక పసిపాప మీద సామూహిక మానభంగం చేసారు . ఇక మన 
తెలుగు టివిలు 1 -9 , A-Z లు చర్చ మొదలు పెట్టారు. అలాంటి ఒక చర్చలో "ఎందుకు ఔను కాదు" పార్టీ నాయకురాలు కూజా( కూర జాంబవతి)  మాట్లాడుతూ "ఒక ఆడది  హోం మినిస్టర్ గా ఉన్న రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద అత్యచారమా? అని ప్రశ్నించింది. అదే చర్చలో ఉన్న మరొక మేధావి , బహుశా ఆ పాప ఆ విషయమును వాళ్ళతో చెప్పి ఉండ వచ్చు కాని వాళ్లకి ఉంగా భాష రాక అర్ధం చేసుకోలేదు . కాబట్టి  ఇలాంటి అత్యాచారాలను ఆపాలంటే ఉంగా భాషను వెంటనే అన్ని స్కూల్స్ లో నేర్పించాలి అని అన్నాడు.
(మొన్న వరంగల్ ఆసిడ్ దాడి అప్పుడు తెలుగు దేశం సారీ, కాంగ్రే ... క్షమించాలి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నేత రోజా ఆడది హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో అన్న మాట పై ఇది వ్రాసాను , కొస మెరుపు ఏంటంటే ఒక  ఆడది హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ ఆడది మరొక ఆడదానిని (పనిపిల్లను) గారెలు సరిగా వేయలేదని వేడివేడి నూనెతో కాల్చింది)

No comments:

Post a Comment