మహాత్ముడికి కోపం వస్తే...
అప్పుడు గాంధీ మహాత్ముడు అతనితో " మీకు అసలు విశ్వాసము లేదు. నేను స్వతంత్రం కొరకు ఎంత చేసాను. మీరు నాకు ఏమిచ్చారు? అన్ని చోట్ల నా విగ్రహాలు పెట్టారు, మంచిదే కాని ప్రతీ విగ్రహం కూడా నుంచునో లేక నడుస్తునట్లో పెట్టారు. ఏ ఆ శివాజీ లాగా నాకు కూడా గుఱ్ఱము ఇస్తే ఎంచక్కగా కూర్చునే వాడినిగా, నా కాళ్ళు ఎంత నెప్పి పెడుతున్నాయో తెలుసా? " అన్నాడు .
మరునాడు అతను చాలా మంది ఎం.ఎల్ .ఏ లను మంత్రులను కలిసాడు , కాని ఒక్కరు కూడా అతని మాట పట్టించుకోలేదు. చివరకు ఒక మంత్రి ఆ రాత్రి బాపుజీని కలవడానికి ఒప్పుకున్నాడు.
ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఆ విగ్రహము దగ్గరకు వచ్చారు. సరిగ్గా అర్ధరాత్రి అయిన తర్వాత బాపూజీ మళ్లీ వచ్చాడు.
ఆ వ్యక్తితోటి గుర్రం గురించి అడిగాడు.
దానికి అతడు బాపూ నేను చాలా పేదవాడిని నీకు గుర్రం కొనే శక్తి నాకు లేదు , అందుకనే ఈయనను తీసుకొచ్చాను అని మంత్రిని చూపించాడు.
దానికి గాంధీ మహాత్ముడు " నిన్ను గుర్రం తెమ్మంటే గాడిదను తెచ్చావా ? అన్నాడు కోపంగా.



very nice.. well said
ReplyDeleteThank You Voleti gaaru
ReplyDelete