Wednesday, 21 December 2011

నేను అన్నది తప్పా? మీరే చెప్పండి.




ఏంటో ఈ ఆడవాళ్ళు వీళ్ళను అర్ధం చేసుకోవడం చాలా కష్టం . 

మా  అమ్మ నాన్నా ఇద్దరు చనిపోయ్యారు . వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పెద్దదిగా చేసి హాలులో పెట్టాను. 





నా భార్య వచ్చి మా నాన్నా కూడా చనిపోయ్యరుగా , ఆయన ఫోటో కూడా పెడదాము అంది.

నేను మీ అమ్మను కూడా చనిపోనియ్యి ఇద్దరిది కలిపి ఒకే సారి పెడదాము అన్నాను . 

ఇది తప్పా మీరే చెప్పండి. ఆవిడకు ఎందుకు అంత కోపం వచ్చిందో నాకు అర్ధం కాలేదు.

Friday, 2 December 2011

సిగ్గులేదు నా డబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషిస్తావా?



ఒక యువకుడికి చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగము వచ్చింది. వాళ్ళ ఆఫీస్ ముందు ఒక బిచ్చగాడు అడుక్కుంటున్నాడు. ఇతను రోజు ఒక రూపాయి బిచ్చం వేసేవాడు. రెండు సంవత్సరాలు అయిన తర్వాత అర్ధ రూపాయి వెయ్యడం ప్రారంభించాడు . మళ్ళీ రెండు సంవత్సరాలు అయిన తర్వాత పావలా ఇవ్వడం మొదలు పెట్టాడు. 



ఆ ముష్ఠి వాడు అయ్యా మీరు ఒకప్పుడు నాకు రూపాయి ఇచ్చేవారు, తర్వాత కొద్ది కాలానికి అర్ధరూపాయి ఇవ్వడము మొదలుపెట్టారు, ఇహ ఇప్పుడు మరీ ఘోరంగా పావలాయే ఇస్తున్నారు . ఇట్లా అయితే మేము ఎట్లా బ్రతుకుతామయ్యా  అని అడిగాడు.



దానికి ఆ ఉద్యోగి నాకు ఉద్యోగం వచ్చిన క్రొత్తలో నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నీకు రూపాయి ఇచ్చాను, తర్వాత నాకు పెళ్లి అయ్యింది. నా భార్య వలన కొంత కర్చు పెరిగింది, కాబట్టి అర్ధ రూపాయి ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు , మళ్ళీ కర్చు పెరిగింది కాబట్టి ఇప్పుడు పావలా ఇస్తున్నాను. అయినా నా భార్య బిడ్డలను నేను పోషించుకోవద్దా? అన్నాడు.



ఆ బిచ్చగాడు కోపంతో ఊగిపోతూ అంటే నాడబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషించుకుంటున్నావా? నీకు సిగ్గులేదు అన్నాడు.

Thursday, 1 December 2011

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ ని అయినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే !!!


ఈ తెలుగు చిత్ర సీమలో ఎందరో కథానాయకులు ఉండగా నేను విక్టరీ వెంకటేష్ అభిమానిని అయ్యాను. మిగతా హీరోలు ఎంత చక్కగా ఎడ్వ టైస్ మెంట్స్  ఇస్తున్నారో చూడండి .

నాగార్జున అక్కినేని  కల్యాణి జ్యూవలర్స్ని ప్రోస్తాహిస్తూ  తన అభిమానులను మరియు తెలుగు ప్రేక్షకులను ఉత్సాహ పరుస్తున్నాడు.

మహేష్ బాబు జోయల్క్కాస్ కొనమని గోల పెడుతున్నాడు.

జూనియర్ ఎం టి ఆర్ కూడా మలబార్ గోల్డె మంచిది అంటున్నాడు.

చివరికి అప్పులలో ఉన్నాను అంటున్న జగపతి బాబు కూడా సి ఎం ఆర్ బంగారమే కొనండి అంటున్నాడు. ( ఈయన దరిద్రం ఏమిటంటే ఆ యాడ్ కి సంబంచిన ఒక్క ఫోటో కూడా దొరకలేదు)


వాళ్ళందరూ కొను కొను అని ప్రోస్తాహిస్తుంటే మరి మనవాడు తాకట్టు పెట్టమని/అప్పులు చేయమని ఢంకా భజాయించి చెప్పుతున్నాడు.



కొసమెరుపు: ఈ అప్పులు తీర్చుకోవాలంటే నాకు కొంత అప్పు కావాలి . ఎవరైనా అప్పు ఇస్తారా? but one thing it is not only my principle not to pay interest, but also my interest not to pay principal.

Tuesday, 15 November 2011

కాఫీ కప్పుల మోనాలిసా

ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరములో 3,604 కాఫీ కప్పులతో మోనాలిసా చిత్రాన్ని చిత్రకారులు తయ్యారు చేసారు. ఈ 3,604 కప్పుల  కాఫీలో పాలు వివిధ మోతాదులలో కలిపి వివిధ రంగులు వచ్చేలాగున జాగ్రత్త తీసుకున్నారు.








Monday, 14 November 2011

చాయ్ గరం బిస్కెట్ నరం కానే వాలా బేషరం

రోజూ కొన్ని కప్పుల  టీ త్రాగడము మంచిది , ఎందుకంటే టీ ఆకులలో ఆంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.




టీ తయారు చేసే విధానమును బట్టి మూడు రకముల టీ లు ఉన్నాయి.
 అవి బ్లాకు టీ, గ్రీన్ టీ మరియు ఊలంగ్ టీ . 
బ్లాకు టీ అంటే గాలిలో ఎండబెట్టడము లేక కుళ్ళ బెట్టడము , గ్రీన్ టీ అంటే ఆవిరిలో ఉడకబెట్టుట, ఊలాంగ్ టీ అంటే కొంచం కుళ్ళ బెట్టడము ఇటువంటి ప్రక్రియల ద్వారా టీ లను తయ్యారు చేస్తారు.


 గ్రీన్ టీ తీసుకోవడము వలన గుండెకు మేలు జరుగుతుంది. ఎలాగంటే శరీరపు బరువు, కొలెస్ట్రాల్  మరియు రక్త పోటు తగ్గి గుండెకు మేలు చేస్తుంది. 


అంతే కాక గ్రీన్ టీ చక్కరను నియంత్రించుటలో సహాయ పడుతుంది. 


హెర్బల్ టీలు కేమేల్లియా సేనసిస్ (టీ ఆకులు)తో తయారు చేయబడవు కాబట్టి అవి అసలు టీలే కాదు మరియు టీ ద్వారా వచ్చే ఏ లాభాలు వాటి వలన రావు.


 టీలో ఆంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా పొందాలంటే , టీ కాచిన తర్వాత మూడు నుండి ఐదు నిముషాలు టీ సారం దిగులాగున ఉంచాలి .

 ఐస్ టీ వేడి టీ అంత మంచిది కాదు. 


(గ్రీన్) టీ పిల్లలలో ఎలాంటి ప్రభావము చూపిస్తుందో ఇంత వరకు తెలియదు, ఎందుకంటే టీ పై పెద్దలలోనే గాని పిల్లలపై ఇంత వరకు పరీక్షీంచలేదు  లేదు. 


అల్లాగే గర్భిణీ స్త్రీలు , పాలిచ్చు తల్లులు గ్రీన్ టీ ఎక్కువగా త్రాగకూడదు.




 బ్లాకు టీ భోజనముతో గాని భోజనము అయిన వెంటనే గాని తీసుకుంటే , ఆహారములోని ఇనుమును శరీరము  అస్సలు     గ్రహించదు, కాబట్టి భోజన సమయములో టీ తీసుకోకూడదు.

Sunday, 13 November 2011

హైదరాబాద్ ఆటోనా మజాకా

మేడ్ ఇన్ జపాన్ 


ఒక జపాన్ టూరిస్ట్ హైదరాబాద్ వచ్చి ఆటో  ఎక్కి సిటీ చూస్తున్నాడు.  మీ ఇండియాలో కార్లు ఎంత మెల్లిగా  నడుస్తున్నాయి అదే జపాన్లో అయితేనా ఎంత వేగముగా  వెళతాయో తెలుసా? అన్నాడు. మళ్లీ ఏంటి మీ బస్ లు ఇంట స్లో గా ఉన్నాయి అదే జపాన్లో అయితేనా? అన్నాడు. మళ్లీ కొంచం దూరము వెళ్ళిన తర్వాత మీ మోటార్ సైకిళ్ళు ఎంత నిదానముగా వెళ్ళుతున్నాయి అదే జపాన్ లో అయితేనా? అన్నాడు. చివరికి దిగేటప్పుడు మీటరు చూసి షాక్ తిని ఏంటి మీ మీటరు ఇంట ఫాస్టుగా తిరుగుతుంది అన్నాడు. ఈ మీటరు   మేడ్ ఇన్ జపాన్ అని జవాబిచ్చాడు ఆటోవాలా .

అనగనగా ......




పూర్వాకాలంలో ప్రయాణాలు చాలా రోజులు చెయ్యాల్సి వచ్చేది . లాడ్జిలు కూడా ఉండేవి కావు , కాబట్టి ఎవరైనా ఒకరి ఇంట్లో ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చేది. ఒక యువకుడు అలాంటి ఒక ప్రయాణంలో ఉండి చీకటి పడేటప్పటికి ఒక ఊరు చేరుకున్నాడు . ఆ రాత్రికి అక్కడ బస చేద్దామనిచేప్పి ఒక ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు , ఆ ఇంటి యజమానితో విషయం చెప్పాడు , దానికి ఆయన బాబు మా ఇంటిలో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ప్రక్క ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ యువకుడు ప్రక్క ఇల్లు తట్టి, సంగతి చెప్పాడు దానికి ఆ గృహస్తు బాబు మా ఇంటిలో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు ఇంకొక ఇల్లు చూసుకో అన్నాడు. ఇలా చాలా ఇల్లు తట్టాకా ఆ యువకుడికి చాలా విసుగు వచ్చింది . చివరకు ఒక ఇల్లు తలుపులు తట్టి , ఆ ఇంటి ఆయనతో మీ ఇంట్లో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారా? అని అడిగాడు. ఆయన ఉన్నారు ,ఎందుకు? అని అడిగాడు. ఏమిలేదు ఈ రాత్రి మీ ఇంట్లో గడుపుదామని చెప్పాడు.


ఒక యువతీ గాంధీ హాస్పిటల్ లిఫ్ట్ లో బిడ్డను ప్రసవించింది. అందరు ఆవిడను వింతగా చూస్తుంటే ఆవిడ సిగ్గు పడి, ఏడవడము ప్రారంభించింది. ఒక నర్సు ఆవిడను ఊరడిస్తూ ," దీనికే అంత ఇది అవుతే ఎలా? నీకు తెలుసా రెండు ఏండ్ల క్రితం ఒకావిడ ఏకంగా గేటు దగ్గరే ప్రసవించింది" అన్నది. దానికి ఆవిడ , " తెలుసు ,అది కూడా నేనే " అంది మరింత బిగ్గరగా ఏడవడము మొదలు పెట్టి.