Friday, 27 January 2012

భగవాన్ కో గుస్సా క్యోం ఆయా?

భగవాన్ కో గుస్సా క్యోం ఆయా?




ఒక ఇంటిలో పెళ్లి కాని అమ్మాయి , ఎవరిని అయినా ప్రేమించి కాలు జారి కడుపు తెచ్చుకున్నప్పుడు ఆమె తల్లి " భగవంతుడా ఎంత పని చేసావు?" అని అన్నప్పుడు.

మహాత్ముడికి కోపం వస్తే...


మహాత్ముడికి కోపం వస్తే...




ఒక ఇల్లు లేని వ్యక్తీ రోజు ఫుట్ పాత్  మీద పడుకుంటున్నాడు. ఒక రోజు   ఫుట్ పాత్  మీద  స్థలం లేక అక్కడ గాంధీ విగ్రహము ఉంటే దాని దగ్గర పడుకున్నాడు. అర్ధరాత్రి అయిన తర్వాత ఎవరో నిద్ర లేపుతుంటే మెలకువ వచ్చింది. లేచి చూస్తే గాంధీ మహాత్ముడు నుంచుని చేతి కర్రతో తడుతున్నాడు. ఆ   వ్యక్తి   వెంటనే మహాత్ముని ముందు మోకరిల్లి నమస్కరించాడు.


 అప్పుడు గాంధీ మహాత్ముడు అతనితో " మీకు అసలు విశ్వాసము లేదు. నేను స్వతంత్రం కొరకు ఎంత చేసాను. మీరు నాకు ఏమిచ్చారు? అన్ని చోట్ల నా విగ్రహాలు పెట్టారు, మంచిదే కాని ప్రతీ విగ్రహం కూడా నుంచునో లేక నడుస్తునట్లో పెట్టారు. ఏ ఆ శివాజీ లాగా నాకు కూడా గుఱ్ఱము ఇస్తే ఎంచక్కగా కూర్చునే వాడినిగా, నా కాళ్ళు ఎంత నెప్పి పెడుతున్నాయో తెలుసా? " అన్నాడు .






మరునాడు అతను చాలా మంది ఎం.ఎల్ .ఏ లను మంత్రులను కలిసాడు , కాని ఒక్కరు కూడా అతని మాట పట్టించుకోలేదు. చివరకు ఒక మంత్రి ఆ రాత్రి బాపుజీని కలవడానికి ఒప్పుకున్నాడు. 
ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఆ విగ్రహము దగ్గరకు వచ్చారు. సరిగ్గా అర్ధరాత్రి అయిన తర్వాత బాపూజీ మళ్లీ వచ్చాడు. 
ఆ వ్యక్తితోటి గుర్రం గురించి అడిగాడు.

దానికి అతడు బాపూ నేను చాలా పేదవాడిని నీకు గుర్రం కొనే శక్తి నాకు లేదు , అందుకనే ఈయనను తీసుకొచ్చాను అని మంత్రిని చూపించాడు. 
దానికి గాంధీ మహాత్ముడు " నిన్ను గుర్రం తెమ్మంటే గాడిదను  తెచ్చావా ?  అన్నాడు కోపంగా.


Tuesday, 24 January 2012

నాకు సలహా ఇవ్వరు?



యండమూరి వీరేంద్ర నాథ్  డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అనే నవలలో , ఒక పేద బడి పంతులు హీరో దగ్గరకు వచ్చి ఒక సలహా తీసుకుంటాడు . దానికి డబ్బులు చెల్లించ మంటే మళ్లీ ఇస్తాను అంటాడు . కాని మళ్లీ కనపడదు . అప్పుడు హీరో సినిమా లలోను కధల్లోనూ ఇలాంటివాళ్ళను అమాయకులుగాను మోసపోయేవాళ్లగాను చూపిస్తారు . కాని నిజ జీవితములో అవకాశము వస్తే ఎవరైనా మోసం చేస్తారు అని అనుకుంటాడు.


ఆ మధ్య నేను రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతములో కారు టైరు పంక్చర్ అయింది . పక్కనే ఉన్న పంక్చర్ షాప్ కు వెళ్ళాను . అతను మీ దగ్గర జాకీ ఉందా ? అని అడిగాడు. లేదు అన్నాను. స్టేఫేనీ ఉందా? అన్నాడు. లేదు అన్నాను. వెంటనే నూట అరవై అవుతుంది అన్నాడు. నేను  పంక్చర్ వేయించు కోవడం తప్ప వేరే అవకాశము లేదు అని అతను అర్ధం చేసుకున్నాడు. కాబట్టి నన్ను దోచుకున్నాడు. మామూలుగా అయితే ఏభయ్ రూపాయలు తీసుకుంటారు. 

ఈసారి మళ్లీ అలాంటి  పరిస్థితి వస్తే ఈసారి జాకీ, స్టేఫేనీ రెండు ఉన్నాయి అనే చెపుతాను. ఇప్పుడు స్టేఫేనీ వాడితే మరలా దీనికి పాచ్ వేయించుకోవాలి కాబట్టి , దీనికే పంక్చర్ వేయి అని చెపుతాను. 
కాని నా జాకీ ఇవ్వను , నీ దగ్గర ఉన్న జాకీ తోనే పాచ్ వెయ్యి అని చెప్పాలి. నా జాకీ ఇవ్వక పోవడానికి ఏ కారణం చెప్పాలో సలహా ఇవ్వ గలరా?

Sunday, 22 January 2012

జ్ఞాపకార్ధము

ఈ రోజు గ్రాహం స్టైన్స్ మరణ దినము.



Wednesday, 21 December 2011

నేను అన్నది తప్పా? మీరే చెప్పండి.




ఏంటో ఈ ఆడవాళ్ళు వీళ్ళను అర్ధం చేసుకోవడం చాలా కష్టం . 

మా  అమ్మ నాన్నా ఇద్దరు చనిపోయ్యారు . వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పెద్దదిగా చేసి హాలులో పెట్టాను. 





నా భార్య వచ్చి మా నాన్నా కూడా చనిపోయ్యరుగా , ఆయన ఫోటో కూడా పెడదాము అంది.

నేను మీ అమ్మను కూడా చనిపోనియ్యి ఇద్దరిది కలిపి ఒకే సారి పెడదాము అన్నాను . 

ఇది తప్పా మీరే చెప్పండి. ఆవిడకు ఎందుకు అంత కోపం వచ్చిందో నాకు అర్ధం కాలేదు.

Friday, 2 December 2011

సిగ్గులేదు నా డబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషిస్తావా?



ఒక యువకుడికి చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగము వచ్చింది. వాళ్ళ ఆఫీస్ ముందు ఒక బిచ్చగాడు అడుక్కుంటున్నాడు. ఇతను రోజు ఒక రూపాయి బిచ్చం వేసేవాడు. రెండు సంవత్సరాలు అయిన తర్వాత అర్ధ రూపాయి వెయ్యడం ప్రారంభించాడు . మళ్ళీ రెండు సంవత్సరాలు అయిన తర్వాత పావలా ఇవ్వడం మొదలు పెట్టాడు. 



ఆ ముష్ఠి వాడు అయ్యా మీరు ఒకప్పుడు నాకు రూపాయి ఇచ్చేవారు, తర్వాత కొద్ది కాలానికి అర్ధరూపాయి ఇవ్వడము మొదలుపెట్టారు, ఇహ ఇప్పుడు మరీ ఘోరంగా పావలాయే ఇస్తున్నారు . ఇట్లా అయితే మేము ఎట్లా బ్రతుకుతామయ్యా  అని అడిగాడు.



దానికి ఆ ఉద్యోగి నాకు ఉద్యోగం వచ్చిన క్రొత్తలో నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నీకు రూపాయి ఇచ్చాను, తర్వాత నాకు పెళ్లి అయ్యింది. నా భార్య వలన కొంత కర్చు పెరిగింది, కాబట్టి అర్ధ రూపాయి ఇచ్చేవాడిని. ఇప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు , మళ్ళీ కర్చు పెరిగింది కాబట్టి ఇప్పుడు పావలా ఇస్తున్నాను. అయినా నా భార్య బిడ్డలను నేను పోషించుకోవద్దా? అన్నాడు.



ఆ బిచ్చగాడు కోపంతో ఊగిపోతూ అంటే నాడబ్బుతో నీ భార్యా బిడ్డలను పోషించుకుంటున్నావా? నీకు సిగ్గులేదు అన్నాడు.

Thursday, 1 December 2011

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ ని అయినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే !!!


ఈ తెలుగు చిత్ర సీమలో ఎందరో కథానాయకులు ఉండగా నేను విక్టరీ వెంకటేష్ అభిమానిని అయ్యాను. మిగతా హీరోలు ఎంత చక్కగా ఎడ్వ టైస్ మెంట్స్  ఇస్తున్నారో చూడండి .

నాగార్జున అక్కినేని  కల్యాణి జ్యూవలర్స్ని ప్రోస్తాహిస్తూ  తన అభిమానులను మరియు తెలుగు ప్రేక్షకులను ఉత్సాహ పరుస్తున్నాడు.

మహేష్ బాబు జోయల్క్కాస్ కొనమని గోల పెడుతున్నాడు.

జూనియర్ ఎం టి ఆర్ కూడా మలబార్ గోల్డె మంచిది అంటున్నాడు.

చివరికి అప్పులలో ఉన్నాను అంటున్న జగపతి బాబు కూడా సి ఎం ఆర్ బంగారమే కొనండి అంటున్నాడు. ( ఈయన దరిద్రం ఏమిటంటే ఆ యాడ్ కి సంబంచిన ఒక్క ఫోటో కూడా దొరకలేదు)


వాళ్ళందరూ కొను కొను అని ప్రోస్తాహిస్తుంటే మరి మనవాడు తాకట్టు పెట్టమని/అప్పులు చేయమని ఢంకా భజాయించి చెప్పుతున్నాడు.



కొసమెరుపు: ఈ అప్పులు తీర్చుకోవాలంటే నాకు కొంత అప్పు కావాలి . ఎవరైనా అప్పు ఇస్తారా? but one thing it is not only my principle not to pay interest, but also my interest not to pay principal.