Wednesday, 23 May 2012

పినాకి లారా ఆలోచించండి


తెలిసినట్లుగానే మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగాయి.

 పెట్రోల్ బంకుల ముందు క్యూలు పెరిగాయి.




 పనిలో పనిగా ట్రాఫిక్ జాములు గూడా పెరిగాయి. 

ఇది ఈ సాయంత్రం వీధులలో పరిస్థితి. ఇది అంతా మనకు అవసరమా? 

ఒక్క సారి ఆలోచించండి. మనము వృధాగా ఎంత పెట్రోల్ వేస్టు చేస్తున్నాము, ఇలా పెరిగినప్పుడు ఆ క్యూలలో గంటలకొద్దీ పోరాడి నాలుగు లీటర్ల పెట్రోల్ పోయించుకుని ఏమి సాధిస్తున్నాము. నిజంగా అత్యవసరము ఉండి తొందరగా వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది ఎంత ఇబ్బంది. 


1) ఒక మోటారు సైకిలు యజమాని ఎంత పెట్రోల్ కొట్టించు కుంటాడు, మహా అయితే ఐదు లీటర్లు 5 X 7 = 35 రూపాయలు. ఆ తర్వాత కొత్త రేటుకే కొనాలిగదా. 


2) ఒక కారు యజమాని ఎంత కొంటాడు , ఇరవై లీటర్లు , అంటే 140 రూపాయలు.




ఇది ఒక ప్రాణం కంటే విలువైనదా? ఒక కుటుంబ సమస్య కంటే గొప్పదా? ఒక ఉద్యోగి కష్టము  కంటే పెద్దదా? ఎవరికీ ఏ సమస్య ఉండి ఈ క్యూల వలన వేదన పడుతున్నారో ఆలోచించండి. మనం వ్యక్తిగతముగా ఎంత సమయాన్ని కోల్పోతున్నాము, ఆ రద్దీలో వాహనాలకు నష్టము కలగడము లేదా?

అసలే మనకున్న నెత్తినొప్పులు మనకున్నాయి, తరచుగా వచ్చే ఈ తల నొప్పి కూడా ఎందుకు?


 రోట్లో తల పెట్టి రోకలి పోట్లకు వెరుస్తామా?

 అలాగే వాహనము కొని పెరిగే పెట్రోల్ రేట్లకు భయపడతామా? బాధే సౌక్యమనే భావన రానీవోయి ఆ ఎరుకే నిత్యానందము బ్రహ్మ్హనందము  


ఈ ఆడవాళ్ళను అర్ధం చేసుకోవడము చాలా కష్టం


ఈ ఆడవాళ్ళను అర్ధం చేసుకోవడము చాలా కష్టం

నేను నా స్నేహితుడు ఒక రోజు తెల్లవారు జామున ఇంటికి వెళుతున్నాము.

 నేను అన్నాను " నేను ఇలా ఆలశ్యముగా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను , కారు ఇంజను ముందుగానే  ఆపివేస్తాను, నెమ్మదిగా తలుపులు తీస్తాను , బూట్లు తీసి ముని కాళ్ళ పై నడుచుకుంటూ వెళ్ళి మంచం పై శబ్థం చెయ్యకుండా పడుకుంటాను . అయినా  నా భార్య వెంటనే లేచిపోతుంది " అని అన్నాను.

 దానికి నా స్నేహితుడు " నేను అయితేనా పెద్ద గొడవ చేసుకుంటూ వెళ్ళతాను" అన్నాడు.

 నిజంగానా అని నేను ఆశ్చర్యంగా చూసాను.

వాడు అన్నాడు " కారు హారను పెద్దగా కొడతాను , తలుపులను థడేల్ అని పెద్ద శబ్ధం తో తెరుస్తాను,బూట్ల కాళ్ళను నేలకు గట్టిగా కొడుతూ బెడ్ రూం లోకి వెళ్ళి మంచం మీదికి ఎగిరి దూకి పడుకుంటాను " .

 నేను కళ్ళు పెద్దవి చేసుకుని  మరి  నీ భార్య ఏమీ అనదా? అని అడిగాను.

ఎప్పటి లాగానే నిద్ర నటిస్తుంది అని జవాబిచ్చాడు.
 

Wednesday, 21 March 2012

నా నిజాయితీని మా నాన్న గారు మెచ్చు కున్న విషయం వినండి.

నిజాయితీ 
నా నిజాయితీని మా నాన్న గారు మెచ్చు కున్న విషయం వినండి.


అవి నేను హై స్కూల్ లో చదువుతున్న రోజులు , నా ప్రోగ్రెస్ కార్డ్ లోని మార్కులు చూసి మా నాన్న గారు " నీకు వచ్చిన మార్కులు చూస్తుంటే నాకు ఒక విషయం అర్ధ మౌతుంది, ఇంత దారిద్ర మైన మార్కులు వచ్చాయంటే నువ్వు తప్పకుండా కాపీ మాత్రం కొట్టడం లేదు" అని అన్నారు.


Friday, 16 March 2012

నేను గొప్ప గాయకుడిని అని మీకు తెలుసా?


నిజానికి నా మొదటి కచేరి ఇచ్చే వరకు నాకు తెలియదు. 

 నా అభిమానుల హడావిడి ,వారు నాకు చేసిన సన్మానము చూసి ప్రఖ్యాత గాయకులు శ్రీ బాల మురళి కృష్ణ గారు, శ్రీ జేసుదాస్ గారు మరియు శ్రీ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారు ఆశ్చర్యపొయ్యారు. 


అసలు జరిగిన సంగతి ఏమిటంటే ఒక కచేరిలో వారు ముగ్గురు రెండు రెండు పాటల చొప్పున పాడారు,


 తర్వాత నేను ఒక పాట పాడి రెండవ పాట పాడబోతుంటే, నా అభిమానులు స్టేజి మీదకు దూసుకొచ్చారు.


 నాకు దండలు వేసి , శాలువా కప్పారు.


 ఒక అభిమాని మైక్ లాక్కొని మాట్లాడడము మొదలు పెట్టాడు, " మా మట్టుకు మాకు మీరే గొప్ప గాయకులు , మీ లాంటి గాయకులే ఇప్పుడు ఎంతో అవసరము . ఇంత అద్భుతమైన గాయకుడిని మేము ఎప్పుడు చూడలేదు. నిజానికి మేమందరమూ ఇక్కడ బజ్జీలు, పల్లీలు, టీలు . సోడాలు అమ్ముకునే వాళ్లము. ఇంతకూ ముందు వాళ్ళు పాడినప్పుడు మేము ఒక్కటి కూడా అమ్మలేక పోయ్యాము, కాని మీరు పాడటము మొదలు పెట్టగానే ఒక్కటి గూడా మిగలకుండా అన్ని అమ్మేసుకున్నాము ........

కల చెదిరింది కథ మారింది 
కన్నీరే ఇక మిగిలింది ... కన్నీరే ఇక మిగిలింది 

Friday, 17 February 2012

మీరు ఏ రకము?


ఈ లోకములో నాలుగు రకముల ప్రజలు ఉన్నారు. లోకములో ఉన్న జనులందరూ కూడా వీటిలో ఏదో ఒక తరగతికి చెంది ఉంటారు. వారు ఏ దేశస్తులు అయినా , ఏ జాతి అయినా, ఏ మతం అయినా లేక ఏ కులం అయినా. 

వీటిలో మీరు ఏ తరగతికి చెందినవారో మీరే పరీక్షించుకోండి.


1) సాంప్రదాయ వాదులు (Reactionary)- ఓల్డ్ ఈస్ గోల్డ్ , పాతది అంతా మంచిది. పూర్వా కాలంలో ఎంతో బాగుండేది. అప్పుడు కాలుష్యం లేదు, ఒత్తిడి లేదు, ఇన్ని రకాల జబ్బులు లేవు, మనుష్యుల మధ్య ఆప్యాయతలు , అనురాగము ఉండెడిది. పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా యెంతో సందడి ఉండేది. ఆ రోజులే బాగుండేవి అని అంటుంటారు.


 2) సనాతన వాదులు (Conservatives) - పాతది మంచిదే కాని... పూర్వా కాలం అన్ని బాగుండేవి , కాబట్టి వాటి మీద ఆధారపడి మరింత మంచివాటిని నిర్మించుకుందాము. 


 3) అభ్యుదయ వాదులు ( Progressive)  - పాతది రోత . పూర్వం ఏమి బాగుంది . కరెంట్ లేదు , ఫోన్ లేదు, సౌకర్యాలు లేవు. ఆ కాలంలో కాశీ కి వెళ్ళడమంటే కాటికి వెళ్ళడమే . ఇప్పుడు రైలు ఎక్కితే ఒక రోజు, విమానం ఎక్కితే అదే రోజు వెళ్ళవచ్చు. అప్పటి సాంఘిక పరిస్తితులు కూడా అంతబాగుండేవి కావు అనేక రకాల వైషమ్యాలు అణచివేతలు ఉండేవి. కాబట్టి పూర్వాకాలం ఏమి బాగాలేదు, ఇప్పుడే చాలా బాగుంది. 


 4) విప్లవ వాదులు (Radical) - పాతది రోత, కొత్తది రొచ్చు. వీళ్ళకు పూర్వాకాలము బాగాలేదు, ఇప్పుడు కూడా బాగాలేదు. కాబట్టి ఒక క్రొత్త ప్రపంచాన్ని  నిర్మిద్దాము, నవ సమాజాన్ని సృష్టిద్దాము. పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి. 

Wednesday, 15 February 2012

ఎన్నాళ్ళకు ఒక నిజం చెప్పావు కే సి ఆర్ అన్నా




ఇవాళ కే సి ఆర్ మాట్లాడుతూ "నేను ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు  మందు పంచలేదు " అని అన్నాడు.
ఇది మాత్రం నిజం !!! 


ఔ మల్ల మనకే చాలకపోతే మందికి ఏడ పంచుతాము.

Monday, 13 February 2012

ఇల్లాలి ముచ్చట్లు








నాలుగు జంటలు మరణించి పరలోక ముఖ ద్వారము దగ్గర నిలుచున్నారు. అక్కడ ఉన్న కాపలాదారుడు వారి చిట్టా చూస్తున్నాడు.


మొదటి జంటలో ఉన్న భర్త తో ," నువ్వు పక్క త్రాగుబోతువి , ఎప్పుడు త్రాగుడు త్రాగుడు త్రాగుడు , ఇంకా విశేషం ఏంటంటే నీ భార్య పేరు రమా అయితే నువ్వు "రమ్ము" అని పిలుస్తావు. నీలాంటి వాడికి ఇక్కడ స్థానంలేదు" అని వెళ్ళగొట్టాడు.



రెండవ వ్యక్తి తోటి , " నువ్వు పేకాట పిచ్చి గాడివి నీకు ఎప్పుడు పేకాట పేకాట పేకాట , చివరికి నీ భార్య పేరు జానకి అయితే నువ్వు "జాకీ " అని పిలుస్తావు. నిన్ను లోపలి రానిస్తే దీనిని నువ్వు జూద గృహముగా మారుస్తావు. కాబట్టి నీకు ప్రవేశం లేదు." అన్నాడు.


మూడవ జంట లోని భర్తతో " నీకు రేసులంటే ప్రాణం , రేసులాడకుండా నువ్వు బ్రతకలేవు, నీకు ఎప్పుడు రేసులు రేసులు రేసులు, చివరికి అశ్వని అనే పేరు ఉన్న అమ్మాయిని వెదికి పెండ్లి చేసుకున్నావు. నీ భార్య ను "అశ్వం" అని పిలుస్తావు. నిన్ను అసలు లోపలి రానియ్యను" అన్నాడు.



నాలుగవ జంటలోని వ్యక్తి తన భార్య  కామాక్షి తో "కాముడు" మనల్ని ఎలాగూ లోపలి రానియ్యాడు కానీ పద  వెళ్లి పోదాము  అన్నాడు.