Sunday, 30 October 2011

నాగ రాజును నేనే


మొన్న ఉదయము టి వి లో చంద్రకళ "నోము పండించావా స్వామి " అని పాడుతుంటే చూస్తున్నాను , ఇంతలో మా ఆవిడ ఒక గ్లాస్ నిండా పాలు తెచ్చి తాగమంది, నేను కాఫీ అడిగాను , కాని ఆవిడా పాలే త్రాగమని బలవంతం చేస్తే సరే అని తాగాను . 
ఆ తర్వాత ఏంటి ఈ రోజు పాలు ఇచ్చావు అన్నాను , ఈ రోజు నాగుల చవితి గదండి అన్నది.

భవిష్యత్ హోమో సెక్స్ వల్స్ దే !!!







 ఇప్పటి దాకా స్వలింగ  సంపర్కులు అంటే అసహ్యం , కాని భవిష్యత్ వీరిదే అని అనిపిస్తుంది.    సాక్షి టీవీ లో ఇచ్చిన స్క్రోల్లింగ్ చూసి వ్రాస్తున్నాను . ఆడ కవలలు పుట్టారని వారికి విషమిచ్చి చంపిన తల్లి ,అనంతపూర్ జిల్లాలో జరిగిన సంఘటన . ఈ రకముగా కన్న తల్లే ఆడ పిల్లలను చంపేస్తుంటే , భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటానికి ఆడ వాళ్ళు దొరకక మగవాళ్ళు మగవాళ్ళనే పెళ్లి చేసుకోవలసి ఉంటుంది . జై గే సంస్కృతి జై జై గే  సంస్కృతి. స్వలింగ సంపర్కులార వర్ధిల్లండి .

Tuesday, 25 October 2011

దీపావళి శుభా కాంక్షలు

ఈ ప్రమిదలు

ఈ వెలుగులు

ఈ కాంతులు

ఈ కాకర పువ్వోత్తులు



ఈ పూదండలు

ఈ లడ్లు



 సకల జనులకు శుభములు కలిగించును గాక

     

దీపావళి/దీపావళి/దీపావళి/దీపావళి/దీపావళి/దీపావళి/దీపావళి/దీపావళి


                                  సంతోషకరమైన దీపావళి మీకు అన్నింటిలోను ఆనందం తేవాలని కోరుకుంటున్నాను

Monday, 10 October 2011

నన్ను నమ్మండి నేను వైద్యుడను కాదు 5

నన్ను నమ్మండి నేను వైద్యుడను కాదు 5
25 గుండెను కాపాడే మంచి ఆహార పదార్ధాలు
12. బ్లూ బెర్రీస్ - వీటిలో బీటా కెరోటిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు , అంథోసియానిన్ అనే ఫ్లావనాయిడ్లు, ఎలాజిక్ అనే పోలీఫినైల్, విటమిన్ సి, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం,పొటాషియం మరియు పీచు పదార్థము ఉన్నాయి .ఇతర బెర్రీస్ కూడా మంచివే .

13. కేరట్ - అల్ఫా కెరోటిన్ మరియు పీచు పదార్థము ఉన్నాయి.



14. బ్రకోలీ - బీటా కెరోటిన్, విటమిన్ సి మరియు ఇ, ఫోలేట్, పొటాషియం , కాల్సియం మరియు పీచు పదార్ధం ఉంటాయి .


15. చిలకడ దుంప - బీటా కెరోటిన్, విటమిన్ ఎ , సి మరియు ఇ, పీచు పదార్థము ఉన్నాయి.

16. ఎర్ర బెంగళూరు మిరపకాయ - వీటిలో బీటా కెరోటిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు, విటమిన్  ఎ, ఫోలేట్, పొటాషియం  మరియు పీచు పదార్ధం ఉంటాయి .

17. కమలా ఫలాలు - బీటా క్రిప్తో జాంథిన్, అల్ఫా కెరోటిన్,  బీటా కెరోటిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు,
ఫ్లవోన్స్ అనే ఫ్లావ నాయిడ్స్ , విటమిన్ సి మరియు ఇ, ఫోలేట్, పొటాషియం  మరియు పీచు పదార్ధం

ఉంటాయి .

18. టమాటా- అల్ఫా కెరోటిన్ , బీటా కెరోటిన్, లైకో పెన్ మరియు లూటీన్ అనే కెరోటినాయిడ్లు,
విటమిన్ సి , ఫోలేట్, పొటాషియం  మరియు పీచు పదార్ధం ఉంటాయి .

19. బొప్పాయి కాయ - బీటా కెరోటిన్, బీటా క్రిప్తో జాంథిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు,
విటమిన్ సి మరియు ఇ, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం,పొటాషియం  మరియు పీచు పదార్ధం ఉంటాయి .

20. డార్కు చాక్లేట్ - రిసర్వత్రోల్ , కోకో ఫినోల్స్  అనే ఫ్లావ నాయిడ్స్ ఉన్నాయి.
                                                                                                                                 ఇంకా ఉంది .........

Thursday, 29 September 2011

ముళ్ళపూడి వెంకట లమణ/ఒక్క వివరణ మా ఆలోచనలనే మార్చేసింది .

ఎమ్విఎల్ ఈయన ఎవరో తెలుసా? నూజివీడు కాలేజీ లో తెలుగు బోధకులుగా పనిచేసారు (1970 -1980 దశకములలో). ఎమ్విఎల్ పేరుతొ ఒక వార పత్రికలో బహుశా ఆంధ్ర జ్యోతి అనుకుంటా ప్రశ్నలు జవాబుల శీర్షికను నడిపేవారు. ఈయన హాస్య శైలిని చూసి  అనేక మంది ఈయనే ముళ్ళపూడి వెంకట రమణ అనుకునే వారు , అలాగే ఒకాయన మీరు ముళ్ళపూడి వెంకట రమణ ఐతే ఎం వి ఆర్ అని పెట్టుకోవాలిగాని ఎమ్విఎల్ అని ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నిస్తే , దానికి జవాబుగా నేను బుడుగును కదా నాకు రమణ అని పలకడం రాక లమణ అని పలుకుతాను కాబట్టి నేను ఎమ్విఎల్ అని రాసుకుంటాను అన్నారు . మన హాస్య బ్రహ్మః జంద్యాల లాగ ఈయన కూడా చిన్న వయసులోనే అనుకోకుండా చనిపోయ్యారు . 
ఒక సారి మా కాలేజీకి ముఖ్య అతిదిగా వచ్చారు . బహుశా మా తెలుగు బోధకులుతో ఉన్న అనుబంధము వలన ఐయిఉండవచ్చు ! ఆయన ఎవరో తెలుసా పరుచూరి గోపాలకృష్ణ !!! ఏంటి పండిత పుత్రా పరమ శుంఠ అనే కాదు పండిత శిష్య పరమ శుంఠ అంటున్నారా , మరి పరమానందయ్య శిష్యుల సంగతి మర్చిపోయ్యరా .
ఆ సమయములో ఆయనతో కొద్దిసేపు గడిపే అవకాశము వచ్చింది . ఆయన ఆడదంటే అలుసా( నిజం గానే అలుసు అనిపిస్తది ఆ సినిమా చూస్తే) అనే సినిమా లోని పాట " చెన్న పట్నం చిన్నదానిని చైనా బజారులో ఉన్నదానిని , పూల దుకాణం దాటి   పాలా డిపో మీదుగా , అట్టట్ట దిగి వస్తే అక్కడే మా ఇల్లు " దాని లోని అర్ధమును వివరించే టప్పటికి మాకు చాలా జ్ఞానోదయం ఐయినది . ఇహ అప్పటి నుండి కోడి గుడ్డుకు ఈకలు పీకడం మొదలుపెట్టి జంద్యాల గారు నాలుగు స్తంభాలాట సినిమా తీస్తే ఆ సినిమా పేరుని మార్చాలని , అంత బూతు పేరు ఎలా పెట్టారని గొడవ చేసాము. ఒక్క వివరణ మా ఆలోచనలనే మార్చేసింది .
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే ఏమిలేదు . కాని ఈ   ఎమ్విఎల్ గారి గురించి ఎవరైనా ఇంకా వివరములు ఇవ్వగలరా ???
అదీ నా బాధ , అర్ధమైనది గదా?

Saturday, 24 September 2011

పెద్ద పులి పెండ్లి విందు .

పెద్ద పులి పెండ్లి విందు .
అడవిలో పెద్దపులి పెండ్లి అయ్యింది, అంతా విందుకు రిసెప్షన్ హాల్ కి వచ్చారు . పెండ్లి కుమార్తె బట్టలు మార్చుకొనుటకు వెళ్ళింది . పెండ్లి కుమారుడు ఐన పులి పెండ్లి కుమార్తె గురించి ఎదురు చూస్తున్నది , అందరు కూడా పెండ్లి కుమార్తె గురించి ఎదురు చూస్తున్నారు . ఇంతలో ఒక పిల్లి వచ్చి స్టేజి మీద డాన్సు చేయడం మొదలు పెట్టింది .









పెద్దపులికి కోపం వచ్చింది , వెళ్లి ఆ పిల్లి పీక పట్టుకొని ఎవరునువ్వు అని కోపంగా అడిగింది.









 దానికి పిల్లి నేను కూడా పులినే ... పెండ్లికి ముందు అన్నది .