పూర్వాకాలంలో ప్రయాణాలు చాలా రోజులు చెయ్యాల్సి వచ్చేది . లాడ్జిలు కూడా ఉండేవి కావు , కాబట్టి ఎవరైనా ఒకరి ఇంట్లో ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చేది. ఒక యువకుడు అలాంటి ఒక ప్రయాణంలో ఉండి చీకటి పడేటప్పటికి ఒక ఊరు చేరుకున్నాడు . ఆ రాత్రికి అక్కడ బస చేద్దామనిచేప్పి ఒక ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు , ఆ ఇంటి యజమానితో విషయం చెప్పాడు , దానికి ఆయన బాబు మా ఇంటిలో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ప్రక్క ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ యువకుడు ప్రక్క ఇల్లు తట్టి, సంగతి చెప్పాడు దానికి ఆ గృహస్తు బాబు మా ఇంటిలో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు ఇంకొక ఇల్లు చూసుకో అన్నాడు. ఇలా చాలా ఇల్లు తట్టాకా ఆ యువకుడికి చాలా విసుగు వచ్చింది . చివరకు ఒక ఇల్లు తలుపులు తట్టి , ఆ ఇంటి ఆయనతో మీ ఇంట్లో వయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారా? అని అడిగాడు. ఆయన ఉన్నారు ,ఎందుకు? అని అడిగాడు. ఏమిలేదు ఈ రాత్రి మీ ఇంట్లో గడుపుదామని చెప్పాడు.
ఒక యువతీ గాంధీ హాస్పిటల్ లిఫ్ట్ లో బిడ్డను ప్రసవించింది. అందరు ఆవిడను వింతగా చూస్తుంటే ఆవిడ సిగ్గు పడి, ఏడవడము ప్రారంభించింది. ఒక నర్సు ఆవిడను ఊరడిస్తూ ," దీనికే అంత ఇది అవుతే ఎలా? నీకు తెలుసా రెండు ఏండ్ల క్రితం ఒకావిడ ఏకంగా గేటు దగ్గరే ప్రసవించింది" అన్నది. దానికి ఆవిడ , " తెలుసు ,అది కూడా నేనే " అంది మరింత బిగ్గరగా ఏడవడము మొదలు పెట్టి.


మొదటిది చాలా బాగుంది. అతి త్వరలో ఏదోఒక సినిమాలో వస్తుందేమో!
ReplyDeleteధన్యవాదాలు తెలుగు భావాలు
ReplyDelete