ఎమ్విఎల్ ఈయన ఎవరో తెలుసా? నూజివీడు కాలేజీ లో తెలుగు బోధకులుగా పనిచేసారు (1970 -1980 దశకములలో). ఎమ్విఎల్ పేరుతొ ఒక వార పత్రికలో బహుశా ఆంధ్ర జ్యోతి అనుకుంటా ప్రశ్నలు జవాబుల శీర్షికను నడిపేవారు. ఈయన హాస్య శైలిని చూసి అనేక మంది ఈయనే ముళ్ళపూడి వెంకట రమణ అనుకునే వారు , అలాగే ఒకాయన మీరు ముళ్ళపూడి వెంకట రమణ ఐతే ఎం వి ఆర్ అని పెట్టుకోవాలిగాని ఎమ్విఎల్ అని ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నిస్తే , దానికి జవాబుగా నేను బుడుగును కదా నాకు రమణ అని పలకడం రాక లమణ అని పలుకుతాను కాబట్టి నేను ఎమ్విఎల్ అని రాసుకుంటాను అన్నారు . మన హాస్య బ్రహ్మః జంద్యాల లాగ ఈయన కూడా చిన్న వయసులోనే అనుకోకుండా చనిపోయ్యారు .
ఒక సారి మా కాలేజీకి ముఖ్య అతిదిగా వచ్చారు . బహుశా మా తెలుగు బోధకులుతో ఉన్న అనుబంధము వలన ఐయిఉండవచ్చు ! ఆయన ఎవరో తెలుసా పరుచూరి గోపాలకృష్ణ !!! ఏంటి పండిత పుత్రా పరమ శుంఠ అనే కాదు పండిత శిష్య పరమ శుంఠ అంటున్నారా , మరి పరమానందయ్య శిష్యుల సంగతి మర్చిపోయ్యరా .
ఆ సమయములో ఆయనతో కొద్దిసేపు గడిపే అవకాశము వచ్చింది . ఆయన ఆడదంటే అలుసా( నిజం గానే అలుసు అనిపిస్తది ఆ సినిమా చూస్తే) అనే సినిమా లోని పాట " చెన్న పట్నం చిన్నదానిని చైనా బజారులో ఉన్నదానిని , పూల దుకాణం దాటి పాలా డిపో మీదుగా , అట్టట్ట దిగి వస్తే అక్కడే మా ఇల్లు " దాని లోని అర్ధమును వివరించే టప్పటికి మాకు చాలా జ్ఞానోదయం ఐయినది . ఇహ అప్పటి నుండి కోడి గుడ్డుకు ఈకలు పీకడం మొదలుపెట్టి జంద్యాల గారు నాలుగు స్తంభాలాట సినిమా తీస్తే ఆ సినిమా పేరుని మార్చాలని , అంత బూతు పేరు ఎలా పెట్టారని గొడవ చేసాము. ఒక్క వివరణ మా ఆలోచనలనే మార్చేసింది .
ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే ఏమిలేదు . కాని ఈ ఎమ్విఎల్ గారి గురించి ఎవరైనా ఇంకా వివరములు ఇవ్వగలరా ???
అదీ నా బాధ , అర్ధమైనది గదా?

బాపుగారి గురించి ఎమ్వీయల్ ఇలా అన్నారు:
ReplyDelete"ఎవరి గీత ఎలా వుంటుందో దైవం తప్ప ఎవరూ చెప్పలేరు. కానీ బాపు గీత బావుంటుందని
మనందరిచేతా చెప్పించి బాపు మనందరికీ దైవత్వాన్ని ప్రసాదించాడు"
దటీజ్ ఎమ్వీయల్ !!
ఏమ్వీ అప్పారావు గారు
ReplyDeleteచాల వందనాలు
రాజశేఖర్ గారు
ReplyDeleteఎంవీయల్ గారి గురించి సమాచారం ఈ బ్లాగు లో లభిస్తుంది.
http://mvl-yuvajyothi.blogspot.com/
Ram